హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాన... జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఒకటే వర్షం...

హైదరాబాద్ లో ఉన్నట్టుండి వాన... జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఒకటే వర్షం...

హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి.. వర్షం కురిసింది. శనివారం ( జూన్ 6 ) ఉదయం నుండి వాతావరణం పొడిగా ఉండగా...  మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్మేసి వర్షం కురిసింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ దెబ్బతో ఎండ తీవ్రతతో మండిపోయిన సిటీ చల్లబడింది. వర్షం కురిసిన ఏరియాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఉదయం నుండి ఎండ తీవ్రంగా ఉండి... ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్ల మీద ఉన్న వాహనదారులు చిరుజల్లులను ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణతో పాటు దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఏపీ, యానాం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని ప్రభావంతో ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 

ALSO READ : ఐటీ కారిడార్, టీ-హబ్, ఐకియా ఏరియాకు నైట్ టైం వెళ్లే పబ్లిక్కు బిగ్ రిలీఫ్ !

రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40-50 కి. మీ)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో వర్షం ఇలా:

  • సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఒక్కసారిగా మారిన వాతావరణం…మధ్యాహ్నం వరకుకు ఎండ తీవ్రత ఉన్నా మధ్యాహ్నం తరువాత వాతావరణం మారి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిశాయి.
  • రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మాత్ పూర్ లో వర్షం
  • బషీర్ బాగ్ , అబిడ్స్ , నారాయణగూడ , నాంపల్లి , కోఠి పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు