18న వస్తున్న గాలోడు

18న వస్తున్న గాలోడు

సుడిగాలి సుధీర్, గెహన సిప్పి జంటగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల రూపొందించిన చిత్రం ‘గాలోడు’. సప్తగిరి, పృథ్వీరాజ్, షకలక శంకర్, సత్య క్రిష్ణ ముఖ్యపాత్రలు పోషించారు. నవంబర్ 18న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజైన  ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుధీర్ మాట్లాడుతూ ‘సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సుధీర్ త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్వాత మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోసారి అవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాశం ఇచ్చిన  ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శకుడు రాజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ పులిచ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ల గారికి థ్యాంక్యూ. గెహన సిప్పి చాలా బాగా యాక్ట్ చేసింది. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మించి సినిమా ఉంటుంది. మంచి విజువల్స్, చక్కని మ్యూజిక్ అందించిన భీమ్స్ గారికి స్పెషల్ థ్యాంక్స్’అన్నాడు. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి బాగా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెక్ట్ అయ్యే సినిమా అని చెప్పింది గెహన. దర్శకుడు మాట్లాడుతూ ‘ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు  ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలను కూడా ప్రేక్షకులు ఆదరించారు. మంచి కమర్షియల్ సబ్జెక్ట్. తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం ఉంది’ అన్నారు.