ఫేస్​బుక్​ లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఫేస్​బుక్​ లైవ్​లో ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

ఫేస్​బుక్​ లైవ్​ల పాణం తీసుకోబోయిండు

యువకుడిని కాపాడిన పోలీసులు

హైదరాబాద్ లో సంఘటన

ఉప్పల్, వెలుగు: ఫొటోగ్రఫీలో రాణించలేకపోయాననే బాధతో తాగుడుకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ లైవ్ పెట్టి కత్తితో చేతులపై కట్ చేసుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి, ఆ యువకుడిని కాపాడారు. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. రామంతాపూర్ లోని పీ అండ్ టీ కాలనీలో ఉండే బోగ రవికాంత్ (31)కు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఆయన కోరిక మేరకు తల్లిదండ్రులు మంచి కెమెరాలు కొనిచ్చారు. అయితే రవికాంత్ ఫొటోగ్రఫీలో రాణించలేకపోయాడు. దీంతో తాగుడుకు బానిసయ్యాడు. డబ్బుల కోసం తన దగ్గరున్న కెమెరాలనూ అమ్ముకున్నాడు. చివరికి డిప్రెషన్ లోకి వెళ్లిన రవికాంత్.. ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి 9:45 గంటలకు రాచకొండ కంట్రోల్ రూమ్​కు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇంటి లొకేషన్ ను గుర్తించి, ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విమెన్ ఎస్సై చందన సిబ్బందితో కలిసి వెళ్లి రవికాంత్ ను కాపాడారు. అతడిని హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్ మెంట్ అందించిన తర్వాత బంధువులకు అప్పగించారు. వెంటనే స్పందించి యువకుడిని కాపాడిన సిబ్బందిని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.

For More News..

సిజేరియన్లలో తెలంగాణ టాప్.. ఏపీ సెకండ్..

రూ. 499కే ఆర్టీపీసీఆర్ టెస్ట్.. గంటన్నరలోనే రిజల్ట్

రైతుల సబ్సిడీ యూరియా దారిమళ్లింపు