విద్యార్థులందరికీ పరీక్షలు పెట్టండి

విద్యార్థులందరికీ పరీక్షలు పెట్టండి
  • వచ్చే నెల 1 నుంచి సమ్మెటివ్‌‌ ఎగ్జామ్స్
  • షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యా శాఖ 

హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహించనున్న సమ్మెటివ్ అసెస్‌‌మెంట్‌‌​(ఎస్ఏ–1) పరీక్షల షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ అయింది. డిసెంబర్‌‌‌‌ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అన్ని తరగతులకు ఎస్ఏ–1 ఎగ్జామ్స్‌‌ నిర్వహించనున్నట్టు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఎస్‌‌సీఈఆర్టీ డైరెక్టర్‌‌‌‌ రాధారెడ్డి బుధవారం షెడ్యూల్‌‌ రిలీజ్‌‌ చేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. వీరికి 4వ తేదీతో ఎగ్జామ్స్‌‌ పూర్తవుతాయన్నారు. 6, 7 తరగతి స్టూడెంట్లకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు, 8వ తరగతి స్టూడెంట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఎగ్జామ్స్‌‌ ఉండనున్నాయి. నైన్త్‌‌ క్లాస్‌‌ స్టూడెంట్లకు పేపర్‌‌–1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, పేపర్‌‌‌‌–2 మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.45 వరకు ఉంటుంది. టెన్త్‌‌ స్టూడెంట్లకు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఎగ్జామ్స్‌‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌‌‌‌ 13న రిజల్ట్స్‌‌ ప్రకటించాలని అధికారులు డీఈవోలను ఆదేశించారు. 

టెన్త్‌‌ స్టూడెంట్లకు ఇలా..
1న మ్యాథ్స్‌‌, 2న సైన్స్, 3న సోషల్ స్టడీస్, 4న ఫస్ట్ లాంగ్వేజీ(ఉర్దూ/తెలుగు), 5న థర్డ్‌‌ లాంగ్వేజీ(ఇంగ్లిష్), 6న సెకండ్‌‌ లాంగ్వేజీ ( తెలుగు, హిందీ, ఉర్దూ)