కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

కార్నర్ మీటింగ్స్కు సిద్ధమైన బీజేపీ..రేపు లీడర్లకు శిక్షణ

రాష్ట్ర వ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్కు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రేపు రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రానున్నారు. 11వేల కార్నర్ మీటింగ్ల కోసం దాదాపు 800 మంది లీడర్లను బీజేపీ గుర్తించింది. బీజేపీ నాయకులకు రేపు ఒక్క రోజు శిక్షణ ఇవ్వనున్నారు. మన్నెగూడలో రేపు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో ఏ అంశాలు చర్చించాలనే అంశంపై లీడర్లకు సునీల్ బన్సల్, బండి సంజయ్ దిశానిర్దేశం చేయనున్నారు.