తెలుగు కాదు ఇప్పుడు తమిళ సునీల్.. ఒకటి రెండు కాదు.. ఏకంగా!

తెలుగు కాదు ఇప్పుడు తమిళ సునీల్.. ఒకటి రెండు కాదు.. ఏకంగా!

తెలుగులో కొంతకాలం క్రితం వరకు కమెడియన్ గా ఒక ఊపు ఊపేశాడు సునీల్(Sunil). తన స్టైల్ అఫ్ కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లోల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఈ భీమవరం బుల్లోడు. ఏ క్రమంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఒక సమయంలో సునీల్ లేని సినిమాలేదు అనే రేంజ్ లో సత్తా చాటాడు. కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకున్న ఇమేజ్ ను మొత్తం డామేజ్ చేసుకున్నాడు. హీరోగా చేయాడానికి కామెడియన్ గా తనకు వచ్చిన అవకాశాలన్నింటినీ వదులుకున్నాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన గుర్తింపుని కోల్పోయాడు సునీల్. తిరిగి కమెడియన్ గా చేయడం స్టార్ట్ చేసిన సునిల్.. ఇప్పుడిప్పుడే తన పూర్వ వైభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చినవే.. అరవింద సమేత, కలర్ ఫోటో. ఆల వైకంఠపురంలో, పుష్ప, F3. 

అయితే రీ ఎంట్రీలో సునీల్ తమిళ ఇండస్ట్రీ నుండి కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ క్రమంలో తమిళ నటులకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే సునీల్ రజనీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ సినిమాలో, శివకార్తికేయ మహావీరుడు సినిమాల్లో మంచి అవకాశాలు దక్కించుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. 

ఇక రిలీజ్ కు సిద్ధంగా ఉన్న విశాల్ మార్క్ ఆంటోనీ, రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న బుల్లెట్ సినిమాల్లో కూడా ఫుల్ లెన్త్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. ఇలా తెలుగులోనే కాదు తమిళంలో కూడా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విదంగా ఫుల్ బిజీగా గడుపుతున్నాడు సునిల్.