BORDER 2 Box Office: బోర్డర్ 2 బాక్సాఫీస్ దూకుడు.. 4 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు.. రిపబ్లిక్ డే ఒక్కరోజే 63.59 కోట్ల నెట్!

BORDER 2 Box Office: బోర్డర్ 2 బాక్సాఫీస్ దూకుడు.. 4 రోజుల్లోనే రికార్డు కలెక్షన్లు.. రిపబ్లిక్ డే ఒక్కరోజే 63.59 కోట్ల నెట్!

బాలీవుడ్ స్టార్ హీరోస్ సన్నీ దీియోల్, వరుణ్ ధావన్ నటించిన బోర్డర్ 2 దుమ్మురేపే వసూళ్లు సాధిస్తోంది. నాలుగు రోజుల్లోనే బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్, ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.193.48 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. జనవరి 26 రిపబ్లిక్ డే హాలీడే సందర్భంగా, సోమవారం నాడు ఒక్కరోజే రూ.63.59 కోట్ల నెట్ సాధించి దూకుడు కనబరిచింది. ఈ విషయన్ని మేకర్స్ ప్రకటిస్తూ, బోర్డర్ 2 సినిమా కలెక్షన్ల వివరాలు వెల్లడించారు.

భారీ అంచనాలతో జనవరి 23న థియేటర్లలోకి వచ్చిన బోర్డర్ 2 వసూళ్లను పెంచుకుంటూ వెళ్తోంది. వీకెండ్ మొత్తంలో, బోర్డర్ 2 హిందీ సినిమా ఇండస్ట్రీకి 2026 సంవత్సరంలో మొదటి పెద్ద హిట్‌ను అందించింది. సినిమా మొదటి రోజు కొద్దిగా స్లోగా ప్రారంభమైనప్పటికీ, తర్వాత మూడు రోజులుగా అంచనాలను దాటుతూ దూసుకెళ్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలిస్తే, సినిమా 10 రోజుల్లోనే రూ.500 కోట్ల కంటే ఎక్కువ నెట్ కలెక్షన్ సాధించే అవకాశం ఉంది. అయితే, ఇవాళ బుధవారం కలెక్షన్లు వాస్తవ పరిస్థితిని క్లారిటీ చేస్తాయి.

Sacnilk ట్రేడ్ ట్రాకర్ నివేదిక ప్రకారం, బోర్డర్ 2 సోమవారం (రిపబ్లిక్ డే) రూ.63.59 కోట్ల నెట్ సంపాదించింది. గత రిపబ్లిక్ డే రిలీజ్‌లతో పోలిస్తే ఇది అత్యధిక రికార్డుల్లో ఒకటి. ఈ సందర్భంగా, 2023లో వచ్చిన పఠాన్ మూవీ మాత్రమే రూ.70.5 కోట్ల నెట్ తో ముందుంది. అలాగే, Sky Force (2025) మరియు Fighter (2024) కలెక్షన్స్‌తో పోలిస్తే బోర్డర్ 2 రెండింతలు ఎక్కువ వసూళ్లు సాధించింది.

గత రిపబ్లిక్ డే డే కలెక్షన్లు:

పఠాన్ (2023) – రూ.70.5 కోట్లు

బోర్డర్ 2 (2026) – రూ.63.59 కోట్లు

ఫైటర్ (2024) – రూ.39.5 కోట్లు

స్కై ఫోర్స్ (2025) – రూ.31.60 కోట్లు

బోర్డర్ 2 ఇండియాలో రోజువారీ కలెక్షన్లు:

జనవరి 23న- శుక్రవారం- రూ.32.10 కోట్ల నెట్ 
జనవరి 24న- శనివారం- రూ.40.59
జనవరి 25న- ఆదివారం- రూ.57.20
జనవరి 26న- సోమవారం- రూ.63.59
మొత్తం 4 రోజుల్లో రూ.193.48 కోట్ల నెట్ 

ప్రపంచవ్యాప్తంగా కూడా బోర్డర్ 2 దూకుడు కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్‌లో సినిమా గొప్ప ఆదరణ పొందింది. నాలుగు రోజులలోనే బోర్డర్ 2 సల్మాన్ ఖాన్ సికిందర్ (రూ.184 కోట్లు) మరియు అజయ్ దేవగన్ రైడ్ 2 (రూ.243 కోట్లు) లైఫ్ టైమ్ కలెక్షన్లను దాటేసింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ.251 కోట్ల గ్రాస్‌తో బోర్డర్ 2 లీడ్‌లో ఉంది. త్వరలోనే సినిమా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 2026లో హిందీ సినిమా ఇండస్ట్రీకి బోర్డర్ 2 మొదటి పెద్ద హిట్‌గా నిలిచింది మరియు రిపబ్లిక్ డే బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తోంది.

డైరెక్టర్ అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ వార్ యాక్షన్ డ్రామా ‘బార్డర్ 2’కు అన్ని వైపుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.1971 నాటి ఇండో–పాక్ యుద్ధ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు, నెటిజన్లు ఈ సినిమాను “బ్రిలియంట్ మూవీ”, “దేశభక్తి సినిమా అంటే ఇదే” అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ముఖ్యంగా సన్నీ డియోల్ నటన వేరే లెవల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన ఎమోషన్, ఇంటెన్సిటీ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.