హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోకు బదులుగా సన్నీలియోన్ ఫోటో

హాల్ టికెట్ పై అభ్యర్థి ఫోటోకు బదులుగా సన్నీలియోన్ ఫోటో

కర్ణాటకలో టీచర్స్ రిక్రూట్‭మెంట్ పరీక్షలో అధికారులు చేసిన తప్పిదం వల్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థి తన హాల్ టికెట్‭లో.. తన ఫోటోకు బదులు నటి సన్నీ లియోన్ ఫోటో ఉండటం చూసి షాక్ అయ్యింది. అభ్యర్థి తన హాల్ టికెట్‭ను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. 

దీనిపై కర్నాటక కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్ పర్సన్ బీఆర్ నాయుడు స్పందించారు. హాల్ టికెట్‭పై అభ్యర్థి ఫోటోకు బదులుగా.. సన్నీలియోన్ ఫోటోను ముద్రించడం పై ఆయన మండిపడ్డారు. హాల్ టికెట్‌పై మాజీ పోర్న్‌స్టార్ ఫొటోను ఎలా ముద్రించారంటూ ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలోనే బ్లూ ఫిల్మ్స్‌ చూసే పార్టీ నుంచి ఇంతకుమించి ఏం ఆశించగలమంటూ విమర్శలు చేశారు. సన్నీలియోన్ ఫొటో ముద్రించి ఉన్న హాల్ టికెట్‌ను ఆయన ట్విట్టర్‭లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ ఆరోపణలపై కర్ణాటక విద్యాశాఖ స్పందించింది. "అభ్యర్థే ఫొటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఏది అటాచ్ చేస్తే ఆ ఫొటోనే సిస్టమ్ తీసుకుంటుంది" అని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సంబంధిత అభ్యర్థిని విచారించి.. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.