రాంచీ: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య పరిణామం జరిగింది. గురువారం జరిగిన ఓటింగ్లో సీపీఐ(ఎంఎల్), లాలూ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో బీజేపీ మద్దతు ఉన్న అభ్యర్థి సీటు గెలుచుకోవడం కొసమెరుపు. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీకి సీటు దక్కింది.
క్రాస్ ఓటింగ్ కారణంగా.. ఎన్డీఏ మద్దతుతో బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను ఓడించి రాజ్య సభ స్థానాన్ని గెలుచుకున్నారు. రెండవ స్థానాన్ని అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి బైద్యనాథ్ రామ్ గెలుచుకున్నారు. నత్వానీకి అనుకూలంగా 28 ఓట్లు పోల్ కాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 20 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 19 ఓట్లు రాగా.. వీటిలో మూడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. మరో స్థానంలో బైద్యనాథ్ రామ్ 30 ఓట్లు సాధించి రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు.
ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు నత్వానీకి ఓటు వేయడంతో జార్ఖండ్లో రాజ్యసభ ఎన్నికలు అనూహ్య మలుపు తిరిగాయి. ఆర్జేడీకి నలుగురు ఎమ్మెల్యేలు, సీపీఐ(ఎంఎల్)కి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేల నుంచి, మిత్రపక్షమైన జేఎంఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల నుంచి ఓట్లు లభించాయి. జేఎంఎం తన అభ్యర్థి విజయాన్ని ఖాయం చేసుకోవడానికి అదనంగా రెండు ఓట్లను ఉపయోగించుకుంది. మిగిలిన నాలుగు ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లాయి. జార్ఖండ్‌లో జేఎంఎంకు 34 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 16 మంది, ఆర్జేడీకి 4 మంది, సీపీఐ(ఎంఎల్)కి 2 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
►ALSO READ | ఎంత పనిచేశావ్ రా బుడ్డోడా.. రెండే రెండు సెకన్లు.. ఐఫోన్ నీళ్లలోకి విసిరేశాడు !
ఇదిలా ఉండగా.. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా నాలుగోసారి సేవ చేసే అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతలు. ఇందుకు కారణమైన.. ఎన్డీఏకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 298 మంది ఎంపీలు, ప్రతిపక్షానికి 184 మంది ఎంపీలు ఉన్నారు. వీరితో పాటు ప్రాంతీయ పార్టీలకు చెందిన 38 మంది ఎంపీలు కూడా ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లులను ఆమోదించడానికి ప్రభుత్వానికి మరో 42 మంది ఎంపీలు అవసరం. తృణమూల్, శివసేనల బలంతో ఎన్డీఏ పక్షానికి అదనంగా 26 మంది ఎంపీలు చేరతారు.
రాజ్యసభ విషయానికొస్తే.. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించాలంటే 164 మంది ఎంపీలు అవసరం. రాజ్యసభలో ప్రస్తుతం 245 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో 150 మంది ఎంపీలు ఉన్నారు. మూడింట రెండు వంతుల మెజారిటీకి 164 మంది ఎంపీలు అవసరం. కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే ఎన్డీయేకు ఎంపీల మద్దతు అత్యవసరంగా మారింది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని ఎన్డీయే వదులుకోవడం లేదు.
