ఐఫోన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకేసారి స్పాట్ మనీ కట్టలేకపోయినా ఈఎంఐలు కట్టి మరీ ఈ ఐఫోన్ను కొనుక్కుని వాడుతున్న జనం చాలా మందే ఉన్నారు. ఈ ప్రీమియం ఫోన్ను ఒక బుడ్డోడు అమ్మ తన చేతికి ఇచ్చిన సెకన్ల వ్యవధిలో నీళ్లలో విసిరేశాడు. ఈ ఘటన ఎప్పుడు.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ఇంటర్నెట్లో ఈ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయింది.
Kid throws his mom’s iPhone into the lake during a boat ride 😂 pic.twitter.com/Bg22E4J2Vs
— Tehxi (@yajnshri) June 18, 2026
రెండే రెండు సెకన్లలో ఐఫోన్ అందుకోవడం.. నీళ్లలో విసిరేయడం జరిగిపోయింది. రెప్పపాటులో అంత ఖరీదైన ఫోన్ నీళ్లలో పడిపోవడంతో ఆ పిల్లాడి తల్లి ముఖం దెబ్బకు వాడిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో పిల్లాడి తల్లి, పిల్లాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని బోటింగ్ చేస్తుంది.
►ALSO READ | కండలేమో గానీ గుండెలు ఆగుతున్నాయ్.. జిమ్ నుంచి ఇంటికి.. కాసేపటికే బాడీ బిల్డర్ ప్రాణం పోయింది !
అలాంటి స్థితిలో.. పిల్లాడి తల్లి బోటింగ్ చేస్తున్న సమయంలో పిల్లాడి చేతికి అంత కాస్టీ ఫోన్ ఇవ్వడం తప్పని కొందరంటుంటే.. పిల్లాడు అలా నీళ్లలో పడేస్తాడని ఆమె మాత్రం కల కనలేదుగా అని కొందరు నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా.. పిల్లల చేతికి ఏది ఇవ్వాలో.. ఏది ఇవ్వకూడదో ఈ ఘటనలో చిన్నారుల తల్లిదండ్రులకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసిందని వీడియో చూసిన నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
పిల్లలను అలాంటి ప్రమాదకర బోటింగ్ షికార్లు, సరదాలకు తీసుకెళ్లడమే తప్పనేది ఇంకొందరు నెటిజన్ల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఈ వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రెండ్ అవుతుంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో.. ఏ ప్రాంతంంలో జరిగిందో స్పష్టత లేకపోవడం గమనార్హం.
