రూ.10 కోట్లపైనే..! టామ్ కాడ్మోర్‌పై కన్నేసిన సన్ రైజర్స్

రూ.10 కోట్లపైనే..! టామ్ కాడ్మోర్‌పై కన్నేసిన సన్ రైజర్స్

ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ హరీ బ్రూక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022 వేలంలో హైదరాబాద్ ఈ ఇంగ్లాండ్ యువ బ్యాటర్ ను ఏకంగా 13 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఏమైందో తెలియదు గాని అప్పటివరకు ఫామ్ లో ఉన్న బ్రూక్.. ఐపీఎల్ లో దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క సెంచరీ మినహాయిస్తే ఈ యువ బ్యాటర్ టోర్నీ అంతటా నిరాశపరిచాడు. ఎన్నో అంచనాలు పెట్టుకొని కొనుకున్న బ్రూక్ ఆదుకోకపోవడంతో అతని ప్లేస్ లో మరో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ టామ్ కాడ్మోర్‌ ను తీసుకోవాలని సన్ రైజర్స్ భావిస్తున్నట్టు సమాచారం. 

టామ్ కాడ్మోర్‌ గత సంవత్సరాల కాలం నుండి టీ20 ల్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రపంచంలో లీగ్ ఏదైనా ఈ యువ ఇంగ్లాండ్ బ్యాటర్ బంతిని అలవోకగా బౌండరీ దాటిస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్ టీ10 లీగ్ లో ఆడుతున్న కాడ్మోర్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నాడు. తాజాగా వారియర్స్ మీద జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లోనే 69 పరుగులు చేసి బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో బ్రూక్స్ ప్లేస్ లో సన్ రైజర్స్ యాజమాన్యం కాడ్మోర్‌పై దృష్టి పెట్టారు. డిసెంబర్ 19 న జరిగే వేలంలో ఈ పవర్ హిట్టర్ కు దక్కించుకోవడానికి 10 కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

ప్రస్తుతం సన్ రైజర్స్ విభాగంలో  కెప్టెన్ మార్కరం, క్లాసన్ తో పాటు ఫిలిప్స్ తో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అయితే టాప్ ఆర్డర్ లో హైదరాబాద్ జట్టుకు సరైన బ్యాటర్ లేడు. వికెట్ కీపింగ్ కూడా చేయగల కాడ్మోర్‌ సన్ రైజర్స్ జట్టులో పర్ఫెక్ట్ గా సరిపోతాడని యాజమాన్యం భావిస్తుంది. మరోవైపు బౌలింగ్ లో భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్, సుందర్ లతో దుర్బేధ్యంగా కనిపిస్తుంది. మొత్తానికి ఇంగ్లాండ్ బ్యాటర్ స్థానంలో మరో ఇంగ్లాండ్ బ్యాటర్ ను తీసుకుంటారో లేదో చూడాలి.