SRH vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. మార్పులు లేకుండానే ఢిల్లీ జట్టు

SRH vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. మార్పులు లేకుండానే ఢిల్లీ జట్టు

ఐపీఎల్ 2025లో సోమవారం (మే 5) ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో కోల్‌‌‌‌‌‌‌‌కతా, ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన అక్షర్ పటేల్ సేన ఈ పోరులో తప్పకుండా నెగ్గాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. ప్రస్తుతం ఢిల్లీ 10 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లు సాధించి ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉంది. మరోవైపు పది మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ఏడింటిలో ఓడి ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు వైదొలిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధమైంది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సచిన్ బేబీ, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(సి), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్

►ALSO READ | IPL 2025: CSK జట్టులో మరో చిచ్చర పిడుగు: ఫాస్టెస్ట్ సెంచరీ హీరోని రూ.30 లక్షలకు పట్టేసిన చెన్నై