చిత్తుగా ఓడిన సన్‌ రైజర్స్‌

చిత్తుగా ఓడిన సన్‌ రైజర్స్‌
  • హిట్  పెయిర్‌ రైజర్స్ ఫెయిల్
  • లాస్ట్ మ్యాచ్ లో బెంగుళూరు పంజా
  • చెలరేగిన హెట్‌ మెయిర్‌ , గుర్‌ కీరత్‌
  •  హైదరాబాద్‌ ప్లే ఆఫ్‌ ఆశలు ఆవిరి!

‌‌‌‌‌‌‌వెళ్తూ వెళ్తూ విరాట్‌ సేన సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌కు దిమ్మతిరిగే షాకిచ్చిం ది. బెంగళూరును ఓడించి రయ్‌ రయ్‌ మంటూ ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోదామనుకున్న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ జట్టు నెత్తిన హెట్‌ మెయిర్‌‌‌‌‌‌‌‌, గుర్‌‌‌‌‌‌‌‌కీరత్‌ బండ వేశారు. నాలుగో వికెట్‌ కు 14.5 ఓవర్లలో 144రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి జట్టును గెలిపించిన వీరిద్దరూ ఆరెంజ్‌ ఆర్మీ మతి పోగొట్టా రు. ఈ సీజన్‌లో ఆర్ సీబీకి అదిరిపోయే ఫినిష్‌ ఇచ్చారు. కీలక పోరులో ఓడిపోయిన సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ ప్లే ఆఫ్‌ ఆశలు సాంకేతికంగానే మిగిలున్నాయి . నేడు జరిగే మ్యాచ్‌ లో ముంబై చేతిలో కోల్‌‌‌‌‌‌‌‌కతా ఓడిపోతే మెరుగైన రన్​రేట్​  ఆధారంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను నాకౌట్‌ దశలో చూడొచ్చు.

బెంగళూరు: సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు భంగపాటు.లాస్ట్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌ లో గెలిచి ప్లేఆఫ్‌ చేరాలని భావించిన రైజర్స్‌ కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు షాకిచ్చింది. అనూహ్యంగా చెలరేగిన హెట్‌మెయిర్‌- (47బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 75), గుర్‌ కీరత్‌ మన్​(48 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్​తో 65) దెబ్బకు పన్నెండో సీజన్‌ లో హైదరాబాద్‌ జర్నీకి పుల్‌ స్టాప్‌‌‌‌‌‌‌‌ పడినట్టే. చిన్న స్వామి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో సన్‌ రైజర్స్‌ ను ఓడించిం ది. తొలుత హైదరాబాద్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (43 బంతుల్లో 5ఫోర్లు , 4సిక్సర్లతో 70 నాటౌట్‌ ) అజేయ హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. అనంతరం ‘మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్ ’హెట్‌ మెయిర్‌ , గుర్‌ కీరత్‌ హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో బెం గళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 178 రన్స్‌ చేసి గెలిచింది.

చితకొట్టిన షిమ్రన్‌ , గుర్‌‌‌‌‌‌‌‌కీరత్‌

లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లభించిన అదిరిపోయే ఆరంభాన్ని సన్‌ రైజర్స్‌ వినియోగించుకోలేకపోయింది. మూడు ఓవర్లు ముగిసేలోపే బెంగళూరు టాప్‌‌‌‌‌‌‌‌ బ్యాట్స్‌ మెన్‌ పార్థివ్ పటేల్‌ (0), విరాట్‌ (16),డివిలియర్స్‌ (1) పెవిలియన్‌ కు చేరడంతో రైజర్స్‌ విజయం లాంఛనమే అనిపించిం ది. ఇన్నింగ్స్‌ మూడో బంతికే పార్థివ్‌ (0)ను ఔట్‌ చేసిన భువీ.. తన తర్వాతి ఓవర్లో డివిలియర్స్‌ (1)ను పెవిలియన్‌ చేర్చాడు.అంతకుముందు  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(16)ని రెండో ఓవర్‌ వేసిన ఖలీల్‌ ఔట్‌ చేయడంతో ఆర్‌ సీబీ ఫ్యాన్స్‌ మూగబోయారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెట్‌ మెయిర్‌ , గుర్‌ కీరత్‌ అనూహ్యం గా చెలరేగిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు నబీ,  రషీద్‌ ను టార్గెట్‌ చేసిన హెట్‌ మెయిర్‌ భారీ షాట్లతో బౌండ్రీలు కొడుతూ రెచ్చి పోయాడు. రషీద్‌  వేసిన 11వ ఓవర్లో రెండు సిక్సర్లు బాది 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన షిమ్రన్‌ .. ఆ తర్వాతా అదే జోరు చూపాడు. మరోఎండ్‌లో గుర్‌ కీరత్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో టార్గెట్‌ ఇట్టే కరిగిపోయింది. భువీ వేసిన 13వ ఓవర్లో హెట్‌ మెయిర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను యూసుఫ్‌ నేలపాలు చేశాడు. అప్పటికి అతను 60 రన్స్‌ వద్ద ఉన్నా డు. తర్వాత అతను కాస్త వేగం తగ్గిం గా.. గుర్‌ కీరత్‌ గేరు మార్చాడు. శంకర్‌ వేసిన 16వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రషీద్‌ వేసిన 18వ ఓవర్లో గుర్‌ కీరత్‌ , హెట్‌ మెయిర్‌ చెరో సిక్సర్‌ కొట్టి మ్యాచ్‌ ను తమవైపు లాగేసుకున్నారు. విజయానికి 12 రన్స్‌ అవసరమైన దశలో షిమ్రన్‌ఔటవగా..19వ ఓవర్లో గుర్‌ కీరత్‌ , సుందర్‌ (0)ను ఔట్‌ చేసిన ఖలీల్‌ ఆశలు రేపాడు. కానీ, చివరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన ఉమేశ్‌ (9 నాటౌట్)బెంగళూరును గెలిపించాడు.

విలియమ్సన్‌ ఒక్కడే..

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ హీరో విలియమ్సనే. టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన సన్‌ రైజర్స్‌ ప్రారంభం నుంచి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా కేన్​ ఒక్కడే పోరాడాడు. తొలుత సన్‌ రైజర్స్‌ఓపెనర్లు సాహా (20), గప్టిల్‌ ( 30)ఇన్నింగ్స్‌ ను ధాటిగా ప్రారంభించారు. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ వికెట్‌ కు 4.3 ఓవర్లలోనే 46 రన్స్‌ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు.చహల్‌  వేసిన నాలుగో ఓవర్‌ లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌  బౌండరీలు కొట్టి ఊపుమీదున్న సాహాను సైనీ ఐదో ఓవర్‌ లో ఔట్‌చేశాడు. వన్‌ డౌన్‌ లో వచ్చిన మనీశ్‌ పాండే(9)తోపాటు టచ్‌లో కనిపించిన గప్టిల్‌ ను ఒకే ఓవర్‌ లో ఔట్‌చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ రైజర్స్‌కు షాకిచ్చాడు. ఈ దశలో విలియమ్సన్‌ , విజయ్‌ శంకర్‌ (18 బంతుల్లో 3 సిక్సర్లతో 27)జాగ్రత్తగా ఆడుతూ 14 ఓవర్లో జట్టు స్కోరు వంద దాటించారు. వేగం పెంచే క్రమంలో సుందర్‌ వేసిన 14వ ఓవర్‌ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన విజయ్‌ తర్వాతి బాల్‌ కే గ్రాండ్‌ హోమ్‌కు చిక్కాడు. అయినా కెజ్రోలియా వేసిన తర్వాతి ఓవర్‌ లో రెండు సిక్స్‌లు కొట్టిన విలియమ్సన్‌  స్కోరు వేగం తగ్గకుం డా చేశాడు. యూసుఫ్‌ పఠాన్‌ (3)ను ఔట్‌  చేసిన చహల్‌ ఐపీఎల్‌ కెరీర్‌ లో వందో వికెట్‌ ఖాతాలో వేసుకోగా.. నబీ(4), రషీద్‌ ఖాన్‌ (1) కూడా నిరాశ పరచడంతో రైజర్స్‌ 150 రన్స్‌ చేస్తే గొప్పే అనిపించింది. కానీ, అప్పటి దాకా క్లాస్‌ ఆటతో ఆకట్టుకున్న కేన్‌ .. ఉమేష్‌  వేసిన లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఓవర్లో వరుసగా 6, 4, 6, 4 కొట్టి  స్టేడియాన్ని హోరెత్తిం చాడు. చివరిబాల్‌ కు భువనేశ్వర్‌ (7 నాటౌట్) ఫోర్‌ బాధగా ఈఓవర్లో ఏకంగా 28 రన్స్‌ వచ్చాయి.

స్కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు

సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : సాహా (సి) ఉమేశ్‌ (బి) సైనీ 20, గప్టిల్‌ (సి) కో హ్లీ (బి) సుం దర్‌ 30, ప ాండే (సి) హె-ట్‌ మెయిర్ (బి) సుం దర్‌ 9, విలియమ్సన్‌ (నాటౌట్‌ ) 70, విజయ్‌ (సి) గ్రాండ్‌ హోమ్‌ (బి) సుందర్‌ 27, యూసుఫ్‌ (సి) ఉమేశ్‌ (బి) చహల్‌ 3,నబీ (సి) గురుకీరత్‌ (బి) సైనీ 4, రషీద్‌ (సి) హెట్‌ మెయిర్ (బి) కెజ్రోలియా 1, భు వనేశ్వర్‌ (నాటౌట్‌ ) 7; ఎక్స్‌ ట్రాలు: 4 ; మొత్తం : 20 ఓవర్లలో175/7 ;

వికెట్ల పతనం: 1–46, 2–60, 3–61,4–106, 5–127, 6–137, 7–139 ; బౌలింగ్‌ :ఉమేశ్‌ 4–0–46–0, సైనీ 4–0–39–2, చహల్‌4–0–24–1, కెజ్రోలియా 4–0–29–1, సుం దర్‌3–0–24–3, గ్రాండ్‌ హోమ్‌ 1–0–12–0.

రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : పార్థి వ్‌ (సి) మనీ శ్‌ (బి)భు వనేశ్వర్‌ 0, కో హ్లీ (సి) సా హా (బి) ఖలీల్‌ 16,డివిలియర్స్‌ (సి) గప్టి ల్‌ (బి) భు వనేశ్వర్‌ 1 , హె-ట్‌ మయెర్‌ (సి) శంకర్‌ (బి) రషీద్‌ 75, గుర్‌ కీరత్‌(సి) యూసుఫ్‌ (బి) ఖలీల్‌ 65, గ్రాండ్‌ హోమ్‌ (నాటౌట్‌ ) 3, సుం దర్ (సి) మనీశ్‌ (బి) ఖలీల్‌ 0, ఉమేశ్‌ (నాటౌట్‌ )9; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు: 9; మొత్తం : 19.2ఓవర్లలో 178/6;

వికెట్ల పతనం : 1–1, 2–18,3–20, 4–164, 5–167, 6–168; బౌలింగ్‌ :భు వనేశ్వర్‌ 4–0–24–2, ఖలీల్‌ 4–0–37–3,రషీద్‌ 4–0–44–1, నబీ 2.2–0–26–0, థంపి4–0–29–0, శంకర్‌ 1–0–16–0.