Manamey Release Date: శర్వానంద్ ‘మనమే’స్పెషల్ అప్డేట్..ఈ సీజన్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఇదే

Manamey Release Date: శర్వానంద్ ‘మనమే’స్పెషల్ అప్డేట్..ఈ సీజన్ బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ రిలీజ్ డేట్ ఇదే

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే(Manamey). దేవదాస్ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య(Sriram Adithya) తెరకెక్కిస్తున్న ఈ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో కృతి శెట్టి(Kriti shetty) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్ప‌టికే టైటిల్ గ్లింప్స్, టీజర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్."ఈ సీజన్ యొక్క బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ వస్తోంది..మీ హృదయాల తెరలను చిత్రించడానికి సిద్ధంగా ఉంది" అందుకు జూన్ 7న థియేటర్లో కలుద్దాం అంటూ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. 
  
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఖుషీ, హాయ్ నాన్న ఫేమ్ హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యన కంప్లీట్ చేసుకుంది. ఇక నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత  కాగా..కృతి ప్రసాద్ అండ్ ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

శర్వానంద్ కి సరైన హిట్ వచ్చి చాలా కాలంగా అయింది. మహా సముద్రం,ఆడవాళ్ళు మీకు జోహార్లు కమర్షియల్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఒకే ఒక జీవితం సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.అయితే, శతమానం భవతి, మహానుభావుడు వంటి సినిమాల తర్వాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ను ఇప్పటి వరకు శర్వానంద్ అందుకోలేకపోయారు.మరి క్లిన్ ఫ్యామిలీ సోల్ గా వస్తోన్న మనమే మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.