కియా సెల్టోస్... ఇప్పుడు ఏడు రంగుల్లో

కియా సెల్టోస్... ఇప్పుడు ఏడు రంగుల్లో

కియా సెల్టోస్ కారు..బేస్ వేరియంట్ ఇప్పుుడు ఏడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది గతంలో కేవలం రెండు రంగుల్లో మాత్రమే ఎంపిక ఉండేది. కియా ఇండి యా సెల్టోస్ కలర్ ఆప్షన్లను సవరించింది. 

ఇది ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ HTE వేరియంట్ కు వర్తిస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 10.90 లక్షలు. సెల్టోస్ HTE వేరియంట్ గతంలో క్లియర్ వైట్ , స్పార్క్లింగ్ సిల్వర్ రంగులలో మాత్రమే అందించబడింది. ఈ శ్రేణి ఇప్పుడు క్లియర్ వైట్, స్పార్క్లింగ్ సిల్వర్, ప్యూటర్ ఆలివ్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ మొత్తం ఏడు రంగుల్లో లభిస్తోంది. 

కియా సెల్టోస్ చాలా వేరియంట్లు గ్లేసియర్ వైట్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్ విత్ అరోరా బ్లాక్ పెర్ల్, గ్లేసియర్ వైట్ విత్ అరోరా బ్లాక్ పెర్ల్, ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్‌తో సహా మరో నాలుగు పెయింట్‌లలో అందుబాటులో ఉన్నాయి. కలర్ ప్యాలెట్‌కి అప్‌డేట్ తప్పా ఫీచర్ జాబితా, స్పెసిఫికేషన్‌లు లేదా సెల్టోస్ ధరలకు ఎలాంటి మార్పులు లేవు.

కియా సెల్టోస్ సెక్యూరిటీ పీచర్లు 

ఫార్వర్డ్ కొలిషన్ హెచ్చరిక, లేన్ డిపార్చర్ వార్నింగ్, కీప్ అసిస్ట్, స్టాప్, గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌ సహా 17 ఫీచర్‌లతో ADASని పొందుతుంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌ లు, హిల్ అసిస్ట్, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360-డిగ్రీ కెమెరా, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.