రూ. 2 కోట్లతో ఊడాయించిన వేములవాడ పూజారి

రూ. 2 కోట్లతో ఊడాయించిన వేములవాడ పూజారి
  •  వేములవాడలో కేసు నమోదు  

వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కొంత కాలంగా జ్యోతిష్యం చెబుతున్న ఓ పూజారి పలువురి వద్ద రూ.2 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణంలోని మార్కండేయనగర్ వీధిలో ఓ జ్యోతిష్యాలయం నిర్వహించే  మహేశ్​ పూజారిగా కూడా పనిచేస్తున్నాడు. 

తన దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చేవారితో పాటు పలువురి ఇండ్లలో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. తాను పలు బిజినెస్​లలో పెట్టుబడులు పెడుతున్నానని, అధిక వడ్డీలు ఇస్తానని ఆశ చూపి పలువురి వద్ద రూ.2 కోట్ల వరకు వసూలు చేశాడు. కొద్ది రోజులుగా జ్యోతిష్యాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ ​స్విచ్ఛాప్ ​రావడంతో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. 

దీంతో అప్పులిచ్చిన వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్​ సీఐ వీరా ప్రసాద్​ చెప్పారు.