సీఎం జగన్ పై షర్మిల ఫైర్.. ట్వీట్ వైరల్..

సీఎం జగన్ పై షర్మిల ఫైర్.. ట్వీట్ వైరల్..

ఏపీలో భీకర యుద్దాన్ని తలపించిన ఎన్నికలు ముగిసాయి. ఇప్పుడు అంతా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మాటల యుద్ధంతో తలపడ్డ నేతలంతా ఇప్పుడు రిలాక్స్ మోడీ లోకి వెళ్లిపోయారు.సీఎం జగన్ కుటుంబంతో కలిసి లండన్ వెళ్లగా, వైద్య పరీక్షల కోసం సతీసమేతంగా అమెరికా వెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు.ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వద్దకు వెళ్ళింది.

ఇదిలా ఉండగా, ఎన్నికల సమయంలో సీఎం జగన్ పై వరుస విమర్శలతో దూకుడు చూపించి ఎన్నికల తర్వాత సైలెంట్ అయిన షర్మిల ఇప్పుడు మళ్లీ ట్వీట్ ద్వారా జగన్ పై ఫైర్ అయ్యారు. ఏపీలోని ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి బాలికపై జరిగిన అత్యాచారం గురించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ జగన్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. పొర్లు దండాల మధ్య లండన్ వీధుల్లో విహరిస్తున్న మీకు ఇక్కడి ఆర్తనాదాలు, హాహాకారాలు ఎక్కడ వినిపిస్తాయి అంటూ మండిపడ్డారు.