తిరువీర్ కొత్త సినిమా పాపం ప్రతాప్‌‌

తిరువీర్ కొత్త సినిమా పాపం ప్రతాప్‌‌

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో హిట్ అందుకున్న తిరువీర్.. వరుస ఎక్సైటింగ్‌‌ ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉన్నాడు. త్వరలో తన నుంచి రాబోతున్న సినిమా ‘పాపం ప్రతాప్‌‌’. పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేష్‌‌ దర్శకత్వం వహించాడు. కృషి ఎంటర్‌‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై రాకేష్ రెడ్డి గ‌‌డ్డం, రుద్రదేవ్ మాదిరెడ్డి నిర్మించారు. 

బుధవారం ఈ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.  సమ్మర్‌‌‌‌ స్పెషల్‌‌గా ఏప్రిల్‌‌ 17న థియేటర్స్‌‌కు రానుందని చెప్పారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో తిరువీర్‌‌‌‌, పాయల్‌‌ రాధాకృష్ణ కొత్తజంటగా కనిపించారు.  అజయ్ ఘోష్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎమ్‌‌ రాధా కృష్ణ, సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.