పెద్ది సెట్స్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌‌‌‌‌ తిలక్ వర్మ

పెద్ది సెట్స్‌‌‌‌లో క్రికెటర్‌‌‌‌‌‌‌‌ తిలక్ వర్మ

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' షూటింగ్ సెట్స్‌‌‌‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇందులో రామ్ చరణ్‌‌‌‌ క్రికెటర్‌‌‌‌‌‌‌‌గా నటిస్తుండగా.. స్టార్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ తిలక్ వర్మ ఈ మూవీ షూటింగ్ లొకేషన్‌‌‌‌కు వచ్చి యూనిట్‌‌‌‌ను సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేశారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన రావడంతో సెట్స్‌‌‌‌లో సెలబ్రేషన్ వాతావరణం నెలకొంది. సెట్స్ మొత్తం తిరిగి చూసిన తిలక్‌‌‌‌ వర్మ.. స్పోర్ట్స్ యాక్షన్ సన్నివేశాలను లైవ్‌‌‌‌గా చూసి ఇంప్రెస్ అయ్యారు. యాక్షన్‌‌‌‌తో పాటు అందులోని ఎమోషన్‌‌‌‌ తనకు నచ్చిందన్నారు.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌‌‌‌ వాడిన బ్యాట్‌‌‌‌ను ఈ సందర్భంగా తిలక్‌‌‌‌ వర్మకు గిఫ్ట్‌‌‌‌గా ఇచ్చారు.  ఇక ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి, రై రై రారా పాటలకు హ్యూజ్‌‌‌‌ రెస్పాన్స్‌‌‌‌ వచ్చింది.  ప్రస్తుతం ఫైనల్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ షూటింగ్ జరుగుతోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ వర్క్స్‌‌‌‌ ఊపందుకున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌‌‌‌ 30న సినిమా విడుదల కానుంది.