మాస్ ఎంటర్టైనర్గా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ట్రైలర్

మాస్ ఎంటర్టైనర్గా సూపర్ స్టార్ రజినీకాంత్  జైలర్ ట్రైలర్

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth)  డైరెక్టర్ నెల్సన్ కుమార్(Nelson kumar) కాంబోలో వస్తోన్న మూవీ జైలర్(Jailer). లేటెస్ట్ గా ఈమూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.   ట్రైలర్ స్టార్టింగ్ ఫ్యామిలీ సీన్స్ తో ఆకట్టుకోగా ..రజినీకాంత్ స్టైల్, స్వాగ్ అదిరిపోయేలా ఉన్నాయి. తలైవా రజినీ మార్క్ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తున్నాయి. 

పవర్‌ఫుల్‍ యాక్షన్ సీన్స్ లో..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. తెలుగు యాక్టర్ సునీల్ కాస్త డిఫరెంట్ గెటప్‍లో కనిపించారు. రజినీ నుంచి వస్తోన్న ఈ మాస్ ఎంటర్టైనర్.. ఆగస్టు 10న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. 

లేటెస్ట్ కావాలా అనే సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో తమన్నా గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా  అందాలు ఆరబోసి..కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ (Mohanlal), నాగబాబు, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.