సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత  పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం విచారణ చేపట్టిన దేశ అత్యున్నత ధర్మాసనానికి ఇరు వర్గాల లాయలర్లు తమ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చినా అధికారులకు సహకరించడం లేదని ఈడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

కవిత పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగేంత వరకు నోటీసులు ఇవ్వబోమని.. గతంలో ఈడీ చెప్పిందని.. కానీ, విచారణ పూర్తి కాకముందే మరోసారి నోటీసులు ఇచ్చి ఎమ్మెల్యీ కవితను ఇబ్బందికి గురిచేస్తోందని ఆమె తరపు న్యాయవాది జడ్జికి తెలిపారు. ఇరు వర్గాల  వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు.. తదిపరి విచారణను  ఫిబ్రవరి 16వ తేదీకి వాయిదా వేసింది.  

ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో ఈడీ నోటీసులకు సవాల్ చేస్తూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను ఇంటి దగ్గరే విచారించాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ ప్రకారం.. ఆడవాళ్లను పిలిచి విచారించవద్దన్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధంగా ఈడీ వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు.