ప్రార్థనా స్థలాల చట్టం కేసు: కేంద్రానికి మరింత గడువిచ్చిన సుప్రీం

ప్రార్థనా స్థలాల చట్టం కేసు: కేంద్రానికి మరింత గడువిచ్చిన సుప్రీం

ప్రార్థనాస్థలాల చట్టం 1991లోని కొన్ని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిల్లపై స్పందించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మరింత గడువిచ్చింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలలతో కూడిన ధర్మాసనం డిసెంబర్ 12లోగా అఫడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కేసుపై అత్యున్నత స్థాయి అధికారులతో చర్చించాల్సిన అవసరం ఉన్నందున అఫిడవిట్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోరడంతో న్యాయస్థానం విచారణను జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. 

మధుర, కాశీ వివాదాలకు ప్రార్థనా స్థలాల చట్టం నుంచి పిటిషనర్ మినహాయింపు కోరారు. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్ వేశారు. అయితే అయోధ్య వివాదానికి మాత్రమే సుప్రీం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. స్వాతంత్య్రం అనంతర ప్రార్థనా స్థలాల స్థితిని మార్చవద్దని ఈ చట్టం చెబుతుంది. జ్ఞానవాపి మసీదు కేసులో ఇది వర్తించదని వారణాసి కోర్టు స్పష్టం చేసింది.