సుప్రీంకోర్టు  జడ్జికి  సన్మానం

సుప్రీంకోర్టు  జడ్జికి  సన్మానం

హైదరాబాద్, వెలుగు:  హైకోర్టు ఎంతోమంది జడ్జిలను తయారు చేసిందని, ఆ వారసత్వాన్ని నేటి యువత అందిపుచ్చుకోవాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎస్వీ భట్టి అన్నారు. ఉమ్మడి హైకోర్టులో జడ్జిగా చేసి సుప్రీంకోర్టు జడ్జిగా నియామకం పొందిన ఆయనకు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ముఖ్య అతిథిగా హాజరై ఎస్వీ భట్టిని సత్కరించారు.  

హైకోర్టులో లాయర్​గా పనిచేసిన అనుభవాలను భట్టి గుర్తు చేసుకున్నారు. ఇక్కడ లభించిన గుర్తింపు వల్లే జడ్జి అయ్యానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్ రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు,   పాల్గొన్నారు.