V6 News

వాట్సాప్ యూనివర్సిటీని పరిగణనలోకి తీసుకోం..స్త్రీలపై మత వివక్ష కేసులో సుప్రీం కోర్టు

వాట్సాప్ యూనివర్సిటీని పరిగణనలోకి తీసుకోం..స్త్రీలపై మత వివక్ష కేసులో సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సబంధించిన కేసులో వాట్సాప్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ అభిప్రాయాలు తప్ప.. మిగతా అందరి అభిప్రాయాలను స్వీకరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన ప్రదేశాలలో మహిళల పట్ల వివక్షపై దాఖలైన పిటిషన్లపై చీఫ్​ జస్టిస్‌‌‌‌‌‌‌‌ సూర్యకాంత్‌‌‌‌‌‌‌‌ బెంచ్ గురువారం విచారణ జరిపింది. మత అంశాలపై కోర్టు సంయమనం పాటించాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేత శశి థరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాసిన వ్యాసం ప్రస్తావనకు రాగా.. సీజేఐ స్పందించారు. 

అది వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు.  దీనికి అడ్వకేట్ కౌషల్‌‌‌‌‌‌‌‌ కౌల్‌‌‌‌‌‌‌‌  స్పందిస్తూ.. జ్ఞానం ఏ దేశం, ఏ యూనివర్సిటీ నుంచి వచ్చినా స్వీకరించాలన్నారు. దీంతో బెంచ్ జోక్యం చేసుకుని ‘వాట్సాప్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ’ నుంచి మాత్రం కాదని వ్యాఖ్యానించింది.