
న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ నమోదైన కేసులో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 4 నెలల్లోగా మెరిట్ ఆధారంగా కేసు మళ్లీ విచారించాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ తో కూడిన బెంచ్.. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ ను ఆదేశించింది. ఈ కేసులో సాక్ష్యాధారాలులేవని ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బెంచ్‌తో కాకుండా కొత్త బెంచ్‌తో విచారణ జరపాలని పేర్కొంది. బుధవారం సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ అభికల్ప్ ప్రతాప్ సింగ్ వాదనలు వినిపించగా, సాయిబాబా తరపున సీనియర్ అడ్వకేట్ ఆర్.బసంత్ హాజరయ్యారు.