సమీర్ మధ్యంతర బెయిల్​పై జోక్యం చేసుకోలేం

సమీర్ మధ్యంతర బెయిల్​పై జోక్యం చేసుకోలేం
  • లిక్కర్ స్కామ్​లో ఈడీ పిటిషన్ స్వీకరించేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సమీ ర్ మహేంద్రుకు హైకోర్టు ఇచ్చిన ఆరు వారాల మధ్యంతర బెయిల్ పై జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ బెయిల్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించేందుకు నిరాకరించింది. వైద్య కారణాలతో మనీలాండరింగ్ కేసులో జూన్ 12న సమీర్​కి హైకోర్టు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ.. ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది బెంచ్ ఈ పిటిషన్​ను విచారించింది. 

ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌‌‌‌‌‌‌‌వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు తప్పుడు వాస్తవాలపై ఆధారపడి ఉన్నాయని, దీన్ని ఒక ఉదాహరణగా పరిగణించలేమని వాదించారు. దీనిపై స్పందించిన బెంచ్.. ‘‘ఆరు వారాల బెయిల్ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేం. వచ్చే 10–15 రోజుల్లో బెయిల్ వ్యవధి కూడా అయిపోతుంది”అని పేర్కొంది.