సుప్రీంకోర్టు స్టే.. ఈ వర్షకాలపు సమావేశాలకు రాహుల్ హాజరు

సుప్రీంకోర్టు స్టే.. ఈ వర్షకాలపు సమావేశాలకు  రాహుల్  హాజరు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  దీనిపై రాహుల్ గాంధీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉన్నపళంగా అమల్లోకి వస్తు్ందని  రాహుల్ అడ్వొకేట్లు వెల్లడించారు.  రాహుల్ అనర్హతను లోక్ సభ సెక్రటరీ తొలిగించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు.  అటు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.  

మోదీ ఇంటిపై కేసులో ఈ ఏడాది మార్చిలో రాహుల్ గాంధీని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు శిక్షను విధించింది. ఈ కారణంగా రాహుల్ తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు.  అయితే సూరత్ కోర్టు ఇచ్చిన  తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై  జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌లతోకూడిన ధర్మాసనం 2023 ఆగస్టు 04న విచారణ చేపట్టి స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదు. ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపేయాలంది.  

ఇంతకీ కేసు ఎంటీ? 

2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలోని ఓ వేదికపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరి ఇంటిపేరు మోదీనే ఎందుకు అంటూ  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ కు చెందిన  బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు.  దీంతో సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. . దీన్ని సవాలు చేస్తూ రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై తాజాగా స్టే విధించింది.