ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌పై 5న సుప్రీంకోర్టులో విచారణ

 ఫోన్ ట్యాపింగ్  కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌పై 5న సుప్రీంకోర్టులో విచారణ
  • బెయిల్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొద్దని కౌంటర్ దాఖలు చేయనున్న సిట్‌‌‌‌‌‌‌‌
  • కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనున్న అధికారులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్  కేసులో కీలక పరిణామం. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌‌‌‌‌  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ముందస్తు బెయిల్‌‌‌‌‌‌‌‌  పిటిషన్‌‌‌‌‌‌‌‌పై ఈ నెల 5న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 

ఈ నేపథ్యంలో సిట్‌‌‌‌‌‌‌‌  అధికారులు అప్రమత్తం అయ్యారు. నిందితుడి కస్టడీ విచారణకు అనుమతి కోరనున్నారు. సోమవారం ఢిల్లీకి వెళ్లి న్యాయ నిపుణులను సంప్రదించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభాకర్ రావును సిట్‌‌‌‌‌‌‌‌  విచారిస్తున్న సంగతి తెలిసిందే. నిందితుడు అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే  ఏడుసార్లు సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఆయనను ప్రశ్నించారు. రోజూ 8 గంటల చొప్పున విచారించారు.  

అయితే సిట్‌‌‌‌‌‌‌‌  విచారణకు హాజరవుతున్నా నిందితుడు సహకరించడం లేదని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌‌‌‌‌‌‌‌ఐబీ లాగర్, హార్డ్‌‌‌‌‌‌‌‌ డిస్కుల ధ్వంసం సహా ఫోన్‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ప్రతి అంశం తనకు తెలిసినప్పటికీ  చెప్పడం లేదని ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా నిందితుడు సమాధానం చెప్పినట్లు సమాచారం. 

అయితే ఎలాంటి స్వప్రయోజనం లేకున్నా.. పొలిటికల్  లీడర్లు, వ్యాపారవేత్తలు సహా వేల సంఖ్యలో ఫోన్లను ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌  చేయడంపై సిట్‌‌‌‌‌‌‌‌ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు సమాధానాలు చెప్పలేదని తెలిసింది. దీంతో నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అధికారులు సుప్రీంకోర్టు అనుమతి కోరనున్నట్లు సమాచారం.