తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ

తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు.. అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఓటు‌కు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2017లో ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఆయన..  తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు.

ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తీసుకున్నట్లు అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టు ఓటుకు నోటు వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం వద్దకు చేరుకున్న ఓటుకు నోటు కేసు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. అప్పట్లో ఓటుకు నోటు వ్యవహారం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగింది. రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కారు ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.