
ఇదే మీకు లాస్ట్ వార్నింగ్
ఆర్టీఐ కింద డిఫాల్టర్స్ లిస్ట్ వెల్లడించాలి
బ్యాంకులు NPAల వివరాలు ఇవ్వాలి
లేదంటే కోర్టు ధిక్కరణే
ఆర్బీఐకి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) పేర్లను బయటపెట్టాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. వారి వివరాలు వెల్లడిం చకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 2016లో తెచ్చిన విధానాన్ని తప్పుపట్టింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని వార్నింగ్ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా లోన్లు ఎగ్గొట్టి న వారి పేర్లు తప్పనిసరిగా బయటపెట్టాలని, లేకపోతే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని పేర్కొంది. ఆర్‌బీఐ విధానం రాజ్యాంగానికి కూడా విరుద్ధమని జస్టిస్ లావు నాగే శ్వర రావు, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన బెంచ్ శుక్రవారం స్పష్టం చేసింది.
గతంలోనే తీర్పు చెప్పిన కోర్టు
బ్యాంకుల్లో వార్షిక తనిఖీల నివేదికలను ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసిన వారికి ఇవ్వకపోవడంపై ఈ ఏడాది జనవరిలో కోర్టు స్పందించింది. దీని పై ఆర్‌బీఐకి ధిక్కరణ నోటీసులు పంపింది. రూ.50 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం లోను ఎగ్గొట్టిన వారి పేర్లను వెల్లడించాలని సుప్రీం గతంలోనే తీర్పు చెప్పిం ది. ఈ తీర్పును అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఎస్‌సీ అగర్వాల్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త సుప్రీంకోర్టుకు ఫిర్యా దు చేశారు. రూల్స్‌ను పట్టించుకోని బ్యాంకులకు జరిమానా విధించడానికి సంబంధించిన సమాచారంతోపాటు వాటి రిపోర్టులు కూడా ఇవ్వాలని ఆర్‌బీఐని కోరారు. డిఫాల్టర్ల వివరాలతోపాటు సంబంధిత బ్యాంకుల పేర్లూ ఇవ్వాలని అడిగారు. ఇలాంటి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం గా చెప్పినా.. ఆర్‌బీఐ మాత్రం ‘డిస్‌క్లోజర్ పాలసీ’ని ప్రవేశపెట్టింది. ఇన్‌ఫర్మేషన్ యాక్ట్ కింద డిఫాల్టర్ల వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని అందులో పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఇలా చేశామని వాదించిం ది. దీని పై సుప్రీంను ఆశ్రయించిన అగర్వాల్ కోర్టు ధిక్కరణ నేరం కింద ఆర్‌బీఐపై చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు చెప్పినా ఆర్‌బీఐ పట్టించుకోవడం లేదని వాదించారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం లోన్లు ఎగ్గొట్టిన వారి పేర్లు వెల్లడిం చాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.
సీఐసీ నుంచి కూడా నోటీసులు
డిఫాల్టర్ల సమాచారం ఇవ్వాలంటూ దాఖలైన ఆర్‌టీఐ దరఖాస్తులకు స్పందిం చకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ).. అప్పటి ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కూడా నోటీసులు పంపింది. సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ఆదేశించిం ది. సమాచారం వెల్లడిస్తే ఉండే ఫలితాలను బట్టి ఆ రిపోర్టులు ఇవ్వాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకునే హక్కు తమకు ఉంటుందని ఆర్ బీఐ వాదించిం ది. ఇలా సమాచారం బయటికి ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు హాని కలిగే ప్రమాదం ఉంటుం దని, ప్రజల్లో అనవసర భయాందోళనలు పెరుగుతాయని వాదించింది. ఇలాం టి విషయాలను మీడియా గోరంతలను కొండంత లుగా చేసి చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి బ్యాం కులకు ఇబ్బంది కలుగుతుం దని పేర్కొం ది.
ఆర్థిక వ్యవస్థకు చేటు చేసే విధానాలను పాటిస్తున్న బ్యాం కులు, ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు 2015లోనూ ఆర్ బీఐని ఆదేశించిం ది. డిఫాల్టర్ల సమాచారంతోపాటు సంబంధిత ఇతర వివరాలనూ ఆర్ టీఐ కిం ద ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజలకు బ్యాంకులపై నమ్మకం పోతుందని, భయాందోళనలు పెరుగుతాయని వాదించడం సరికాదంది. సామాన్య ప్రజలు అడిగే సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆర్ బీఐ ఉందని తెలిపింది. మనదేశంలో బ్యాంకుల మొండి బకాయిల విలువ రూ.4 లక్షల కోట్లు ఉంటుందని ఆర్ బీఐ అంచనా వేసింది. ఈ మొత్తంలో 90 శాతం వాటా ప్రభుత్వరంగ బ్యాం కులది కాగా, మిగతాది ప్రైవేటు బ్యాంకులది.
“బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో లోన్లు తీసుకొని ఎగ్గొట్టి న వారి (డిఫాల్టర్లు ) పేర్లను బయటపెట్టాల్సిందే. వారి వివరాలు వెల్లడిం చకుండా ఆర్‌బీఐ 2016లో తెచ్చిన విధానం రాజ్యాంగానికి విరుద్ధం. దాన్ని వెంటనే రద్దు చేయాలి . ఇదే లాస్ట్ ఛాన్స్ . ఉద్దేశపూర్వకంగా లోన్లు ఎగ్గొట్టి న వారి పేర్లు ఆర్టీఐ కింద అడిగితే తప్పనిసరిగా బయటపెట్టాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింది కి వస్తుంది” – సుప్రీంకోర్టు