- ముందు కారణాలపై స్టడీ చేయండి
- తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సూచన
- టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం
- రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం
పొల్యూషన్ కు కారణాలేంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్ లో ఎంతో సమాచారం ఉంది. నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రజలు అభిప్రాయాలు చెప్తున్నారు. మాకూ మెయిల్స్ పంపుతున్నారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతున్నది. దీనిని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు రెండు నెలల గడువు కావాలని కోరడం సరికాదు. ఈ కేసును రెండు వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశంపై నిరంతర ప్రాతిపదికన విచారణ చేపడతాం. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పై అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారంటూ సుప్రీం కోర్టు మండిపడింది. ఢిల్లీ ఎన్ సీఆర్ లో కాలుష్యని యంత్రణ విషయంలో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) తన విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయిందంటూ అసహనం వ్యక్తం చేసింది.
వాయు కాలుష్య నివారణపై సీరియస్ నెస్ కొరవడిందని అభిప్రాయపడింది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూ ర్యకాంత్,జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి నేతృత్వంలోని బెంచ్ మంగళవారం ఈ మేరకు విచారణ చేపట్టిం ది. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఢిల్లీలోని 9 టోల్ ప్లాజాలను వేరే చోటికి తరలించాలన్న ఆదేశాలను అమలు చేసేందుకు రెండు నెలల గడువు ఇవ్వాలన్న అధికారుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఎయిర్ పొల్యూషన్ నివారణపై రెండు వారాల్లోగా నిపుణులతో సమావేశం నిర్వహించి, కాలుష్యానికి ప్రధాన కారణాలను గుర్తించాలని.. చేపట్టబోయే చర్యలపై నివేదిక సమర్పించాలని సీఎక్యూఎంను ఆదేశించింది.
దశలవారీగా దీర్ఘ కాలిక పరిష్కారాలను అమలు చేసే దిశగా కృషి చేయాలని చెప్పింది. "పొల్యూషన్ కుకారణాలేంటో మీరు గుర్తించారా? ఈ విషయంలో పబ్లిక్ డొమైన్ లో ఎంతో సమాచారం కనిపిస్తోంది. నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రజలు అభిప్రాయాలు చె ప్తున్నారు. మాకు కూడా మెయిల్స్ పంపుతున్నారు. హెవీవెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతోం ది. దీనిని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు రెండు నెలల గడువు కావాలనికోరడం మాకు ఆమోదయోగ్యం కాదు. దీనిని రెండు వారాలకు మించి వాయిదా వేయలేం. ఇకపై ఈ అంశంపై నిరంతర ప్రాతిపదికన విచారణ చేపడతాం" అని సీజేఐ బెంచ్ స్పష్టం చేసింది
తొందర లేనట్టుగా కనిపిస్తోంది..
టోల్ ప్లాజాల తరలింపు విషయంలో ఒక పరిష్కారానికి రాకుండా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) అఫిడవిట్ ను సమర్పించడం పైనా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. టోల్ ప్లాజాల వల్ల భారీగా ఆదాయం వస్తోందని, వాటిని తరలించరాదన్న ఎంపీడీ విజ్ఞప్తిపై ఫైర్ అయింది. పొల్యూషన్ నివారణ విషయంలో సీఏక్యూఎంకు ఎలాంటి తొందర లేనట్టుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రవేశపెట్టడం వంటి ఏకైక నిర్ణయాలు తీసుకోవడం కాదని.. ముందుగా సమస్య పరిష్కారాలను లోతుగా అధ్యయనం చేయాలని పేర్కొంది. దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని, అంతవరకూ మంచి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని వివరించింది.
