డాక్టర్లు లేక ఆగిన సర్జరీలు.. క్లాస్ పీకిన ఎమ్మెల్యే

డాక్టర్లు లేక ఆగిన సర్జరీలు.. క్లాస్ పీకిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ : నర్సీపట్నం ఏరియా హస్పిటల్ లో డాక్టర్లు అందుబాటులో లేపోవటంతో సీరియస్ అయ్యారు ఎమ్మెల్యే గణేష్. డాక్టర్లు లేక కొన్నిరోజులుగా గర్భిణులకు ఆపరేషన్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో..వెంటనే హస్పిటల్ కి వచ్చాడు. డాక్టర్ అందుబాటులో లేపోవటంతో హస్పిటల్ అధికారులపై సీరియస్ అయిన ఎమ్మెల్యే గణేష్.. గర్భిణీలకు ఆపరేషన్ కు ఆటంకం లేకుండా ఎనస్తిసియన్ ను రప్పించాలని చెప్పాడు.

అనకాపల్లి నుంచి డాక్టర్ ను రప్పిస్తున్నట్టు అధికారులు చెప్పినా.. ఎమ్మెల్యే హస్పిటల్ నుంచి వెళ్లలేదు. డాక్టర్ వచ్చే వరకు ఉంటానని హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు. అత్యవసర స్థితిలో ఆరుగులు గర్భిణీలు ఉన్నారని..వెంటనే డాక్టర్ ను పిలిపించి వారికి సర్జరీ చేయించాలని అధికారులను ఆదేశించాడు. అయితే సర్జరీ చేసే డాక్టర్ సుధాకర్..అప్పుడప్పులు విధులకు వచ్చి నిర్లక్ష్యంగా వెళ్లిపోతారని హస్పిటల్ వర్గాలు ఎమ్మెల్యేకు చెప్పారు. ఇలాంటి పరిస్థితులు రిపీట్ కావద్దని..సర్కార్ హస్పిటల్ ఉన్నదే పేద రోగులక కోసం అని హస్పిటల్ సిబ్బంధిని హెచ్చరించారు ఎమ్మెల్యే గణేష్.