Asia Cup 2025: ఆసియా కప్ కోసం డిఫరెంట్ గెటప్స్‌లో టీమిండియా క్రికెటర్లు.. ఇందులో నిజమెంత..?

Asia Cup 2025: ఆసియా కప్ కోసం డిఫరెంట్ గెటప్స్‌లో టీమిండియా క్రికెటర్లు.. ఇందులో నిజమెంత..?

ఆసియా కప్ 2025కు సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ఈ కాంటినెంటల్ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 9న హాంగ్ కాంగ్ తో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్ తో టోర్నీ స్టార్ట్ అవుతుంది. సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా ఈ మెగా టోర్నీలో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. సెప్టెంబర్ 10 న యూఏఈతో టీమిండియా తన తొలి మ్యాచ్ తో టోర్నీ ప్రారంభిస్తోంది. ఆసియా కప్ కోసం ఇప్పటికే భారత జట్టు యూఏఈ చేరుకున్నారు. జట్టు మొత్తం ఒకేసారి వ్యక్తిగతంగా యూఏఈలో అడుగుపెట్టారు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టిన మన జట్టు ఊహించని మేక్ ఓవర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.  

ఆసియా కప్ లో అడుగుపెట్టిన మన క్రికెటర్లు యూఏఈలో డిఫరెంట్ గెటప్స్ కనిపిస్తున్న ఫోటోలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. . ముఖ్యంగా స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, శుభమాన్ గిల్ కొత్త హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు. టీమిండియా కెప్టెన్ సూర్య పింక్ కలర్ జట్టుతో కనిపించగా.. హార్దిక్ పాండ్య వైట్ హెయిర్ తో దర్శనమిచ్చాడు. ఇక గిల్ జుట్టు మొత్తం కత్తిరించేసి కలర్ వేశాడు. ప్రస్తుతం వీరి ముగ్గురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. వీరిపై నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వీరు ఆసియా కప్ ఆడడానికి వెళ్ళారా.. లేకపోతే ఫ్యాషన్ కాంపిటేషన్ కు వెళ్ళారా అని ప్రశ్నిస్తున్నారు. 

అసలు విషయానికి వస్తే హార్దిక్ పాండ్య ఒక్కడే తన హెయిర్ స్టైల్ లుక్ మార్చాడు. గిల్, సూర్య గెటప్స్ సోషల్ మీడియాలో ఎడిట్ చేశారు. సూర్య, గిల్ ఇద్దరూ ప్రాక్టీస్ సెషన్ లో నార్మల్ హెయిర్ తోనే కనిపించారు. దీంతో సూర్య, గిల్ పింక్ కలర్ హెయిర్ పిక్స్ లో నిజం లేదని తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమ్ శుక్రవారం సాయంత్రం దుబాయ్‌‌లోని ఐసీసీ అకాడమీలో తొలి ప్రాక్టీస్, నెట్ సెషన్‌‌లో పాల్గొంది.  సూర్య, వైస్ -కెప్టెన్ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ తో పాటు ఆటగాళ్లందరూ మొదట ఫిట్‌‌నెస్ డ్రిల్స్‌‌లో పాల్గొని, ఆ తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్‌‌పై ప్రధానంగా దృష్టి సారించారు. 

మ్యాచ్ పరిస్థితులను అనుకరించేలా (సిమ్యులేషన్)  జట్టు తమ నెట్ సెషన్‌‌ను ప్రారంభించింది. 2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. దుబాయ్‌ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో  సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.