Asia Cup 2025: ఆసియా కప్ కోసం UAE బయలుదేరిన సూర్య.. ఎయిర్ పోర్ట్‌లో భార్యకు ఎమోషనల్ హగ్

Asia Cup 2025: ఆసియా కప్ కోసం UAE బయలుదేరిన సూర్య.. ఎయిర్ పోర్ట్‌లో భార్యకు ఎమోషనల్ హగ్

ఆసియా కప్ కోసం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) కు బయలుదేరాడు. సెప్టెంబర్ 9 నుంచి  ప్రారంభం కానున్న ఈ కాంటినెంటల్ టోర్నీలో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. భారత జట్టుకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఆసియా కప్ కోసం ఈ సారి యూఏఈ వెళ్లే భారత ప్లేయర్లు వ్యక్తిగతంగా వెళ్లాలని బీసీసీఐ చెప్పింది. ఈ కారణంగా టీమిండియా స్క్వాడ్ లోని అందరు ప్లేయర్లు విడివిడిగా ఫ్లయిట్ ఎక్కనున్నారు. గురువారం (సెప్టెంబర్ 4) టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ యూఏఈ పయనమయ్యాడు. 

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం బయట సూర్య తన భార్య దేవిషా శెట్టిని వెళ్లబోయే ముందు కౌగిలించుకున్నాడు. ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ఆ తర్వాత కాసేపు ఫోటోలకు ఫోజులిచ్చి ఎయిర్ పోర్ట్ నుంచి కదిలాడు. ఆసియా కప్ లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. 2023 లో వన్డే ఫార్మాట్ లో జరిగిన ఈ మెగా టోర్నీని భారత జట్టు గెలుచుకుంది. టైటిల్ ను నిలబెట్టుకోవాలంటే ఈ సారి సూర్యకుమార్ యాదవ్ రాణించడం చాలా కీలకం. టీ20 ఫార్మాట్ లో తిరుగులేని ప్లేయర్ గా గుర్తింపు ఉన్న ఈ 34 ఏళ్ల ఆటగాడు 83 టీ20 మ్యాచ్ ల్లో 38.20 యావరేజ్..167.07 స్ట్రైక్ రేట్‌తో 2598 పరుగులు చేశాడు. 

దుబాయ్‌ వేదికగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో  సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా మారనుంది. మొత్తం ఎనిమిది జట్లు పోటీలో ఉండగా.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎలో  ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్‌‌‌‌‌‌‌‌.. గ్రూప్‌‌‌‌‌‌‌‌–బిలో శ్రీలంక, అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ బరిలో నిలిచాయి. దుబాయ్‌‌‌‌‌‌‌‌, అబుదాబి వేదికలుగా ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 19 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జరుగుతాయి.

2023లో జరిగిన గత ఎడిషన్‌‌‌‌‌‌‌‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టైటిల్ నెగ్గిన ఇండియా డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ అన్ని మ్యాచ్ లు దుబాయ్, అబుదాబి వేదికలుగా జరగనున్నాయి. టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య అబుదాబిలో జరుగుతుంది. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది. సూపర్ 4 సెప్టెంబర్ 20 నుండి 26 వరకు జరుగుతుంది. సెప్టెంబర్ 28న జరగనున్న టోర్నమెంట్ ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది.

ఆసియా కప్ పూర్తి షెడ్యూల్

సెప్టెంబర్ 9 - ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ (అబుదాబి)

సెప్టెంబర్ 10 - భారత్ vs యుఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 11 - బంగ్లాదేశ్ vs హాంకాంగ్ (అబుదాబి)

సెప్టెంబర్ 12 - పాకిస్తాన్ vs ఒమన్ (దుబాయ్)

సెప్టెంబర్ 13 - బంగ్లాదేశ్ vs శ్రీలంక (అబుదాబి)

సెప్టెంబర్ 14 - భారత్ vs పాకిస్థాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 15 - యుఎఇ vs ఒమన్ (అబుదాబి) మరియు శ్రీలంక vs హాంకాంగ్ (దుబాయ్)

సెప్టెంబర్ 16 - బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)

సెప్టెంబర్ 17 - పాకిస్తాన్ vs UAE (దుబాయ్)

సెప్టెంబర్ 18 - శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (అబుదాబి)

సెప్టెంబర్ 19 - భారత్ vs ఒమన్ (అబుదాబి)

సూపర్ 4

సెప్టెంబర్ 20 - బి1 vs బి2 (దుబాయ్)

సెప్టెంబర్ 21 - AI vs A2 (దుబాయ్)

సెప్టెంబర్ 23 - A2 vs B1 (అబుదాబి)

సెప్టెంబర్ 24 - A1 vs B2 (దుబాయ్)

సెప్టెంబర్ 25 - A2 vs B2 (దుబాయ్)

సెప్టెంబర్ 26 - A1 vs B1 (దుబాయ్)

సెప్టెంబర్ 28 - ఫైనల్ (దుబాయ్)