
సూర్యాపేట జిల్లా : 30 రోజుల ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ పనుల్లో అధికారులు జిల్లాలోని మారుమూల గ్రామాలు సహ అన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మునగాల మం. మాధవరం గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అమాయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఆ గ్రామంలో పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, మురుగు నీరు నిలచి ఉండడంపై మండి పడ్డారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష వైఖరి ప్రదర్శించినందుకు గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శు లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.