
సూర్యాపేట జిల్లా వైద్యాశాఖాధికారిపై వేటుపడింది. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో DMHO కోటాచలంను విధులనుంచి తొలగించారు. హైదరాబాద్ ప్రజారోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ కు అటాచ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో పలు హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని కోటాచలంపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర వైద్యశాఖ వేసిన ఎంక్వయిరీ కమిటీ విచారణలో కోటాచలంపై అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో కోటాచలాన్ని డీఎంహెచ్ ఓ గా విధులనుంచి తొలగించారు. ఆయన స్థానంలో ఎల్బీనగర్ వైద్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను నియమించారు. సూర్యాపేట జిల్లా వైద్య శాఖ అధికారి అవినీతిపై పలుమార్లు తెలంగాణ యువజన సంఘాల నేతలు ఆందోళన చేశారు.