అచ్చంపేట, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట రేంజ్ పరిధిలోని సిద్దాపూర్, ఘనపూర్ అటవీ ప్రాంతాలలో విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన వెంకటేశ్, నరేందర్ అనే ఇద్దరు సెక్షన్ అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల సిద్దాపూర్ సెక్షన్ పరిధిలోని పద్మారం అటవీ ప్రాంతంలో అటవీ జంతువును వేటాడి చంపిన కేసులో ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు సకాలంలో అందించకపోవడం, విధులకు గైర్హాజరు కావడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
