ఓయూ, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లలో అమలవుతున్న రోస్టర్ విధానాన్ని పునఃసమీక్షించి, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, చట్టబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించేలా సవరణలు చేయాలని మాలల మహాగర్జన సభ డిమాండ్ చేసింది.
ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాల స్టూడెంట్స్ జేఏసీ, ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్, మాల విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మాల ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రోస్టర్ సవరణ డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొఫెసర్ లింబాద్రి, మల్లెపల్లి లక్ష్మయ్య, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, ప్రొఫెసర్లు సవీన్, నాగం కుమారస్వామి, మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
