దక్కన్ డెర్బీలో హైదరాబాద్ బడ్డికి రూ.72 లక్షల ప్రైజ్ మనీ

దక్కన్ డెర్బీలో హైదరాబాద్ బడ్డికి రూ.72 లక్షల ప్రైజ్ మనీ

మలక్‌‌‌‌పేటలోని హైదరాబాద్ రేస్ క్లబ్‌‌‌‌లో ఆదివారం నిర్వహించిన దక్కన్ డెర్బీ–2026లో ‘హైదరాబాద్ బడ్డి’ విజేతగా నిలిచి రూ.72 లక్షల ప్రైజ్‌‌‌‌మనీ సొంతం చేసుకుంది. రేస్ టు విన్ ఫౌండేషన్, హైదరాబాద్ రేస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలో విజేత గుర్రం యజమానులు అనంతుల సుబోద్, ప్రభాకర్ చౌదరికి నిర్వాహకులు ప్రైజ్​ మనీ అందజేశారు.

ప్రపంచ దేశాల్లో హార్స్ రేసింగ్‌‌‌‌ను క్రీడగా నిర్వహిస్తున్నారని, మనదేశంలోనూ దీనిని క్రీడా విధానం పరిధిలోకి తీసుకురావాలని రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 2027 మార్చిలో నిర్వహించనున్న వీకెండ్ హార్స్ రేస్ ‘గాలా’ బ్రోచర్‌‌‌‌ను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్‌‌‌‌తో కలిసి సురేందర్ రెడ్డి ఆవిష్కరించారు.

మలక్​పేట, వెలుగు