TMC ఎమ్యెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా

TMC ఎమ్యెల్యే పదవికి సువేందు అధికారి రాజీనామా

పశ్చిమబెంగాల్ లో రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. మమతాబెనర్జీపై ధిక్కారస్వరం వినిపించి ఆమె పార్టీకి పలువురు నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. వీరిలో TMC లో మొన్నటి వరకు కీలక నేతగా వ్యవహరించిన సువేందు అధికారి కూడా ఉన్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారనే చర్చ జరుగుతోంది.

TMC నుంచి బయటకు వచ్చిన సువేందు అధికారికి ఆ పార్టీ శ్రేణుల నుంచి ముప్పు వాటిల్లే అవకాశం ఉందనే కారణంతో… కేంద్ర ప్రభుత్వం జడ్ కేటగిరీ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. మరోవైపు సువేందు అధికారి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఆమోదించలేదని అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ తెలిపారు. సువేందు పంపిన రాజీనామా లేఖ నిర్దేశిత ఫార్మాట్ లో లేదని  తెలిపారు.