‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ చేపట్టాలి: గవర్నర్ తమిళిసై

‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ చేపట్టాలి: గవర్నర్ తమిళిసై

జీకాట్‌‌‌‌‌‌‌‌ వర్చువల్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో గవర్నర్‌‌‌‌‌‌‌‌ త‌‌‌‌‌‌‌‌మిళిసై

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘‘గ్రామాలే దేశానికి వెన్నెముక అన్న మ‌‌‌‌‌‌‌‌హాత్ముడి మాట‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను పాటిస్తూ గ్రామ స్వరాజ్య సాధ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌కు జీకాట్ చేస్తున్న కృషి ఒక స్వదేశీ ఉద్యమం. మ‌‌‌‌‌‌‌‌హాత్ముడి మార్గాన్ని అనుస‌‌‌‌‌‌‌‌రిస్తూ స‌‌‌‌‌‌‌‌రికొత్త ‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ అనే ఉద్యమం చేపట్టాలి. ఇందుకు జాతీయ‌‌‌‌‌‌‌‌వాద శ‌‌‌‌‌‌‌‌క్తుల‌‌‌‌‌‌‌‌ను ఏకం చేయాలి’’ అని గ‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్నర్ త‌‌‌‌‌‌‌‌మిళిసై పిలుపునిచ్చారు. గ్రామోద‌‌‌‌‌‌‌‌య చాంబ‌‌‌‌‌‌‌‌ర్ ఆఫ్ కామ‌‌‌‌‌‌‌‌ర్స్ అండ్ టెక్నాల‌‌‌‌‌‌‌‌జీ (జీకాట్‌‌‌‌‌‌‌‌) ఆధ్వర్యంలో జ‌‌‌‌‌‌‌‌రుగుతున్న మూడు రోజుల వ‌‌‌‌‌‌‌‌ర్చువ‌‌‌‌‌‌‌‌ల్ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో శ‌‌‌‌‌‌‌‌నివారం గవర్నర్ మాట్లాడారు. కరోనా ప్రభావం 10 ప్రపంచ‌‌‌‌‌‌‌‌ యుద్ధాల‌‌‌‌‌‌‌‌కు స‌‌‌‌‌‌‌‌మాన‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ని ప్రపంచ మేధావులంతా ఏక‌‌‌‌‌‌‌‌గ్రీవంగా చెబుతున్నారని తెలిపారు. క‌‌‌‌‌‌‌‌రోనా వ‌‌‌‌‌‌‌‌ల్ల జ‌‌‌‌‌‌‌‌రిగిన న‌‌‌‌‌‌‌‌ష్టం ఏ యుద్ధంలోనూ, ఏ బాంబుల వ‌‌‌‌‌‌‌‌ల్లా జ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌లేదన్నారు. క‌‌‌‌‌‌‌‌రోనా వ‌‌‌‌‌‌‌‌ల్ల వారిలో స్టూడెంట్లు, ప‌‌‌‌‌‌‌‌ట్టణ పేద‌‌‌‌‌‌‌‌లు, వ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌స కూలీలే ఎక్కువగా ప్రభావితమయ్యారని తెలిపారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో వ‌‌‌‌‌‌‌‌ర్చువ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌గా బోధించ‌‌‌‌‌‌‌‌డం స్టూడెంట్ల స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యకు ప‌‌‌‌‌‌‌‌రిష్కారమని, ప‌‌‌‌‌‌‌‌ట్టణ పేద‌‌‌‌‌‌‌‌లు, వ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌స కూలీల స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలను ప్రభుత్వాలు అత్యవస‌‌‌‌‌‌‌‌రంగా పరిష్కరించాలన్నారు.

For More News..

రాత్రి దాకా పని చేయించుకొని.. పొద్దుగాల పనిలోంచి తీసేసిన్రు

పోలీస్​ ఆఫీసర్ల పేరుతో 350 నకిలీ ఫేస్​బుక్‌లు

పండుగ ఆఫర్లు షురూ.. త్వరలో ఫ్లిప్‌‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’