భద్రాద్రికి 100కోట్లు ఇయ్యకపోతే దీక్షలకు దిగుతం

భద్రాద్రికి 100కోట్లు ఇయ్యకపోతే దీక్షలకు దిగుతం

భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడని ఉద్యమ టైంలో నినదించిన కేసీఆర్.. సీఎం అయ్యాక భద్రాచలంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. టౌన్​లోని ప్రముఖులను కలిసిన అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రాద్రి ఆలయానికి రూ.100కోట్లు ఇస్తానన్న సీఎం100 పైసలు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లే సంప్రదాయాన్ని బ్రేక్ ​చేస్తావా అని ప్రశ్నించారు. పాండురంగాపురం నుంచి సారపాక వరకు13 కి.మీల రైల్వే లైను వేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.15 రోజుల్లో రూ.100కోట్లు ఇవ్వకపోతే 16వ రోజు నుంచి భద్రాచలంలోనే స్వామీజీలంతా కలిసి దీక్షలు చేపడతామని హెచ్చరించారు.