‘అఖండ 2 : తాండవం’ (Akhanda 2 Thaandavam) విడుదల వేళ (డిసెంబర్ 12) ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి. ఓ వైపు బుకింగ్స్ జోరు కొనసాగిస్తుండగానే.. ఇంట్రెస్టింగ్ విజువల్స్ షేర్ చేస్తున్నారు మేకర్స్. నిన్న సాయంత్రం కొత్త టీజర్తో బ్లాస్ట్ చేయగా.. ఇవాళ (డిసెంబర్ 11న) మరో కొత్త సాంగ్ తీసుకొచ్చారు. ‘శివ శివ..’(Shiva Shiva) అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ అర్ధవంతంగా ఉంది.
‘‘ప్రాణం పోసిన శంఖరుడు ఆడే చోట.. కట్టిన పుణ్యం కట్టెల పానుపు సిద్ధం చేసే ఆటేరా.. తల్లిబిడ్డకు మధ్యన కట్టిన కోట.. పుట్టెడు నిప్పుల పట్టం కట్టే బాటేరా’’ అనే పదాలతో ప్రేక్షకులను ఎమోషనల్ అయ్యేలా చేశారు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి. కనకవ్వ, శ్రుతి రంజనీ తమదైన శైలిలో పాడి పాటకు ప్రాణం పోశారు. ఇప్పటికే రిలీజైన అఖండ 2 సాంగ్స్ తాండవం చేస్తుండంగా.. ఈ పాట ఎమోషనల్ అయ్యేలా చేస్తుండటం విశేషం!
ఇదిలా ఉంటే.. తెలుగు సినిమా బాక్సాఫీస్‌పై 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి మూడు బ్లాక్‌బస్టర్‌ల తర్వాత, ఈ డైనమిక్ ద్వయం నుండి వస్తున్న ప్రెస్టీజియస్ సీక్వెల్ 'అఖండ 2: తాండవం') ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విడుదల వాయిదా పడటంతో పాటు, ఇపుడు బుకింగ్స్ కూడా జోరుగా జరగడం వంటి అంశాలతో అందరినీ తమవైపుకు తిప్పుకుంది. మరి బాలయ్య విశ్వరూపం స్క్రీన్ మీద చూడాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే!
ALSO READ : అఖండ2 సినిమాకు ఊహించని షాక్.. తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

