ఐపీఎల్ 2026 మినీ వేలం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా లీగ్ మినీ ఆక్షన్ మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో జరగనుంది. 350 మంది ఆటగాళ్ల జాబితాను మంగళవారం (డిసెంబర్ 9) బీసీసీఐ ప్రకటించింది. వేలానికి ముందు దాదాపు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2026 వేలం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుందని బీసీసీఐ మంగళవారం (డిసెంబర్ 9) తెలిపింది. మినీ ఆక్షన్ కు పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాజరు కానున్నాడు. పంజాబ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ లేపకపోవడమే ఇందుకు కారణం.
ఐపీఎల్ 2026 వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుండి నడిపించనున్నాడు. ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ లేకపోవడంతో తమ దగ్గర ఉన్న డబ్బుతో తమ జట్టుకు అవసరమైన ప్లేయర్ ను ఎంచుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ సిరీస్ లో పాంటింగ్ కామెంట్రీ చేస్తున్నాడు. ఛానల్ సెవెన్ నెట్‌వర్క్‌తో కామెంటరీ జట్టులో భాగంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాంటింగ్ లేకపోయినా ఆ బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్ చేపట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్ రెండు విదేశీ ప్లేయర్లతో సహా.. నాలుగు స్లాట్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి.
Also read:- విండీస్ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ మధ్య పోటా పోటీ..
పంజాబ్ కింగ్స్ తమ విదేశీ రిక్రూట్‌మెంట్లలో ఆరోన్ హార్డీ, జోష్ ఇంగ్లిస్, కైల్ జామిసన్‌లను రిలీజ్ చేసింది. అందుబాటులో ఉన్న రూ. 11.50 కోట్లతో తమ 25 మంది సభ్యుల జట్టును నిర్మించుకోనుంది. కింగ్స్ వారి బ్యాకప్ ఇండియన్ స్పిన్నర్, ఓవర్సీస్ టాప్-ఆర్డర్ బ్యాటర్ కమ్ ఆల్ రౌండర్, ఓవర్సీస్ పేసర్ ను టార్గెట్ చేస్తున్నారు. పాంటింగ్ తో జట్టులోకి చేరిన శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ ను 11 ఏళ్ళ తర్వాత తొలిసారి ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను అద్భుతంగా రాణించాడు. 50 యావరేజ్ తో 604 పరుగులు సాధించడంతో పాటు 175 స్ట్రైక్ రేట్ తో దుమ్ములేపాడు.
🚨 Shreyas Iyer expected to be present at the #IPL Auction representing the Punjab Kings#IPLAuction pic.twitter.com/EvbxPubSp3
— Cricbuzz (@cricbuzz) December 10, 2025

