V6 News

Gold Rate: శుక్రవారం భారీగా పెరిగిన గోల్డ్.. వామ్మో వెండి కేజీ రూ.2లక్షల 15వేలు!

Gold Rate: శుక్రవారం భారీగా పెరిగిన గోల్డ్.. వామ్మో వెండి కేజీ రూ.2లక్షల 15వేలు!

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగారం, వెండి రేట్లు ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు. 2025 చివరికి ప్రయాణిస్తున్న కొద్దీ రేట్లు మరింతగా పెరుగుతూ సామాన్యులకు దూరం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో రిటైల్ ఆభరణాల షాపింగ్ కోసం వెళ్లాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతంలో పెరిగిన రేట్లను ముందుగా గమనించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే డిసెంబర్ 11తో పోల్చితే 10 గ్రాములకు డిసెంబర్ 12న రూ.1910 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.191 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు ఇలా భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(డిసెంబర్ 12న):
హైదరాదాబాదులో రూ.13వేల 266
కరీంనగర్ లో రూ.13వేల 266
ఖమ్మంలో రూ.13వేల 266
నిజామాబాద్ లో రూ.13వేల 266
విజయవాడలో రూ.13వేల 266
కడపలో రూ.13వేల 266
విశాఖలో రూ.13వేల 266
నెల్లూరు రూ.13వేల 266
తిరుపతిలో రూ.13వేల 266

ALSO READ : Viకి తగ్గని కష్టాలు.. పెరుగుతున్న ఇనాక్టివ్ కస్టమర్లు

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 12తో పోల్చితే ఇవాళ అంటే డిసెంబర్ 12న 10 గ్రాములకు రూ.1750 పెరుగుదలను చూసింది. దీంతో శుక్రవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు (డిసెంబర్ 12న):
హైదరాదాబాదులో రూ.12వేల 160
కరీంనగర్ లో రూ.12వేల 160
ఖమ్మంలో రూ.12వేల 160
నిజామాబాద్ లో రూ.12వేల 160
విజయవాడలో రూ.12వేల 160
కడపలో రూ.12వేల 160
విశాఖలో రూ.12వేల 160
నెల్లూరు రూ.12వేల 160
తిరుపతిలో రూ.12వేల 160

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం చివర్లో కొనసాగిస్తోంది. డిసెంబర్ 12న కేజీకి వెండి డిసెంబర్ 11తో పోల్చితే రూ.3వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.2 లక్షల 15వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.215 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.