భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ తాను తీసుకున్న రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు ఆమె లక్ష్యం లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరగబోయే ఒలింపిక్స్ అని, ఈ విషయాన్ని వినేష్ స్వయంగా 'X'లో ప్రకటించింది. ఈసారి దేశం కోసం పతకం గెలవాలనే పట్టుదలతో క్రీడల్లోకి తిరిగి వస్తున్నానని, ఈ ప్రయాణంలో తన కొడుకే తనకు అతిపెద్ద ప్రేరణ అని ఆమె వెల్లడించింది.
పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల విభాగంలో కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువ కారణంగా వినేష్ ఫోగట్ పై ఫైనల్‌ల్లో అనర్హత పడింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన ఆమె ఆగస్టు 2024లో రిటైర్మెంట్ ప్రకటించింది.
పారిస్ ఒలింపిక్స్ ముగిసిందా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. చాలా కాలంగా నా దగ్గర సమాధానం లేదు. నేను కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. రెజ్లింగ్ నుండి, ఒత్తిడి నుండి, అంచనాల నుండి, నా సొంత ఆశయాల నుండి కూడా దూరంగా ఉండాలని అనుకున్నాను. ఈ సమయంలోనే నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. నాకు ఇప్పటికీ రెజ్లింగ్ అంటే చాల ఇష్టం. నేను ఇప్పటికీ పోటీ పడాలనుకుంటున్నాను. నాలో ఎప్పుడూ పోరాడే స్ఫూర్తి ఆరిపోలేదని తెలుసుకున్నాను.
►ALSO READ | వీధి కుక్కల హల్చల్.. స్కూల్ సెక్యూరిటీ గార్డు పై ఎగిరి భుజంపై కరిచిన కుక్క..
నేను ఎంత దూరంగా నడిచినా, నాలో ఒక భాగం ఎప్పుడూ రెజ్లింగ్ పైనే ఉండిపోయింది. అందుకే నేను ఇప్పుడు వెనక్కి తగ్గని స్ఫూర్తితో LA 28 ఒలింపిక్స్ వైపు అడుగులు వేస్తున్నాను. ఈసారి నేను ఒక్కదాన్నే కాదు... నా కొడుకు కూడా నా టీంలో చేరాడు. నా అతిపెద్ద ప్రేరణ, LA ఒలింపిక్స్‌కు వెళ్లే ఈ మార్గంలో నా చిన్న చీర్‌లీడర్... అని వినేష్ పేర్కొంది.
పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హతపై వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) లో అప్పీల్ చేయగా... జాయింట్ సిల్వర్ మెడల్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే, ఒలింపిక్స్ తర్వాత ఈ విషయం ఆలస్యం కావడంతో, ఆమె అప్పీల్‌ను చివరికి CAS తిరస్కరించింది.
గతంలో మూడుసార్లు ఒలింపియన్ అయిన వినేష్, ఆసియా & కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలిచింది. కానీ ఒలింపిక్ పతకం సాధించాలనే లక్ష్యంతో మళ్లీ రెజ్లింగ్‌లోకి అడుగుపెడుతోంది.

