V6 News

వీధి కుక్కల హల్చల్.. స్కూల్ సెక్యూరిటీ గార్డు పై ఎగిరి భుజంపై కరిచిన కుక్క..

 వీధి కుక్కల హల్చల్.. స్కూల్ సెక్యూరిటీ గార్డు పై ఎగిరి భుజంపై కరిచిన కుక్క..

వీధి కుక్కల నిషేధం పై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న...  వీధి కుక్కల దాడులు మాత్రం తగ్గట్లేదు.. ఎక్కడి నుండి వస్తాయో  తెలీదుగానీ ఊహించని విధంగా దాడులు చేస్తున్నాయి. ఒకోసారి ఒంటరిగా ఉన్న  చిన్నారులపై దాడులే చేస్తే... ఇప్పుడు పట్టపగలే ఓ వ్యతిపై అది కూడా చూస్తుండగా మీదకి ఎరిగి కరిచేసింది. 

ముంబైలోని గోరేగావ్ వెస్ట్‌లో ఓ స్కూల్ సెక్యూరిటీ గార్డును గురువారం ఉదయం ఓ వీధి కుక్క ఒక్కసారిగా ఎగిరి అతని భుజంపై కరిచింది. డిసెంబర్ 11న ఉదయం 9 గంటల సమయంలో సిద్ధార్థ్ నగర్‌లోని ఆదర్శ్ విద్యాలయ స్కూల్లో జరిగిన ఈ సంఘటన సిసిటివిలో రికార్డైంది.  ఈ ఘటనతో పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న వీధి కుక్కల దాడుల పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. 

వీడియోలో సెక్యూరిటీ గార్డు యూనిఫాంలో స్కూల్ గేటు దగ్గర నడుస్తుండగా, ఓ  వీధి కుక్క ఎంట్రీ  దగ్గర కూర్చుని ఉండగా, మరొక కుక్క ముందు నుండి అతని దగ్గరకు వస్తుంది. గార్డు గేటు వైపు తిరిగి వెళ్ళగానే కుక్క ఒక్కసారిగా  అతనిపైకి ఎగిరి అతని ఎడమ భుజంపై కరుస్తుంది. గార్డు వెంటనే అతని చేతులతో కుక్కను వదిలించుకోగలిగాడు. దింతో ఆ కుక్క అక్కడి నుండి పారిపోతుంది, కాసేపటికి మరొక గార్డు ఓ పెద్ద కర్రతో అక్కడికి చేరుకుంటాడు. 

►ALSO READ | రైల్వే స్టేషన్‌లో ఘోరం.. పడుకున్న యువకుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి... చెప్పుతో కొట్టి పారిపోతున్న వదల్లే..

ఎం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అదే కుక్క మరోసారి వారిపై దాడి చేసేందుకు వస్తుంది. ఆత్మరక్షణ కోసం కర్రను పట్టుకున్న గార్డు కుక్క తలపై కొట్టి, దానిని బయటికి తరిమివేస్తాడు. ఈ సంఘటన ముంబైలో వీధి కుక్కల బెడద గురించి కొనసాగుతున్న చర్చలను ఆజ్యం  పోసింది, ఇక్కడ కుక్క కాటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.