రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ఓ యువకుడిపై ట్రాన్స్‌జెండర్లు(హిజ్రాలు) దాడి చేసిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తుంది. దింతో ఈ వీడియోపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే.. ఈ వైరల్ వీడియోలో రైల్వే ప్లాట్‌ఫారమ్ బెంచ్‌పై ఓ యువకుడు నిద్రిస్తుండగా.. అతని చుట్టూ ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు చేరి ఒక్కసారిగా వారిలో ఒకరు చెప్పు తీసి ఆ యువకుడిని కొడుతుంది. వెంటనే లేచిన ఆ యువకుడు ఒక్కసారిగా వారిని చూసి షాకవుతు.... ఎందుకు కొట్టారో అడిగేలోపే మళ్లీ చెంపదెబ్బలు కొడతారు. చివరికి, ఆ యువకుడు ప్లాట్‌ఫారమ్ నుండి పారిపోతున్న కూడా అతన్ని వెంబడిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
చాలా మంది నెటిజన్లు ఈ వీడియో చూసి తీవ్రంగా ఖండించారు. వీడియోలో పక్కన ఉన్న చాలా మంది ఇదంతా చూస్తున్నా ఎవరూ సహాయం చేయకపోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, ఇండియన్ రైల్వేస్ స్పందించింది. ఇలాంటి సంఘటనలు రైల్వేలు అందించాలనుకుంటున్న ప్రయాణ అనుభవాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి స్టేషన్ పేరు, కాంటాక్ట్ నంబర్‌తో సహా వివరాలను పంపాలని పోలీసులు ప్రజలను కోరారు. ఈ దాడి ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే దానిపై ఇంకా స్పష్టంగా లేనప్పటికీ.... ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారా లేదా అనే దాని పై పోలీసులు లేదా రైల్వే అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

