అండర్-19 ఆసియా కప్‌‌: వైభవ్ సూర్యవంశీ తాండవం.. 95 బంతుల్లో 171.. ఎన్ని సిక్స్లు బాదాడో తెలుసా..?

అండర్-19 ఆసియా కప్‌‌: వైభవ్ సూర్యవంశీ తాండవం.. 95 బంతుల్లో 171.. ఎన్ని సిక్స్లు బాదాడో తెలుసా..?

అండర్-19 ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్.. 14 ఏళ్ల చిచ్చర పిడుగు.. వైభవ్ సూర్యవంశీ యూఏఈ బౌలర్లపై తాండవం ఆడాడు. 56 బంతుల్లో 9 సిక్సులు, 5 ఫోర్లతో సెంచరీ చేసి.. విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. సెంచరీ చేశాక మరింత దూకుడుగా ఆడాడు. 95 బంతుల్లో 14 సిక్సులు, 9 ఫోర్లతో 171 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీకి 29 పరుగుల దూరంలో ఔట్ కావడంతో యూఏఈ బౌలర్లు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.

దుబాయ్లో జరిగిన ఈ మ్యాచ్లో సూర్యవంశీ పరుగుల వరద పారించడంతో భారీ స్కోర్ దిశగా టీమిండియా దూసుకెళుతుండటం విశేషం. యూఏఈ ముందు 400 పరుగుల టార్గెట్ తప్పేలా లేదు. ప్రత్యర్థి యూఏఈ అంటే చాలు.. వైభవ్ సూర్యవంశీ కుమ్మేస్తున్నాడు. రైజింగ్ స్టార్ ఆసియా కప్లో కూడా యూఏఈపై 42 బంతుల్లోనే 144 పరుగులు చేసి యూఏఈ బౌలర్లకు మనోడు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌‌‌‌లో ఒకే ఒక్క ఇన్నింగ్స్‌‌‌‌తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన 14 ఏండ్ల యంగ్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ వైభవ్ సూర్యవంశీ దేశం మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేసిన చిచ్చర పిడుగు ఈ వైభవ్ సూర్యవంశీ. రాజస్తాన్ రాయల్స్ తరఫున మెగా లీగ్‌‌‌‌లో ఎంట్రీ ఇచ్చి తన మూడో మ్యాచ్‌‌‌‌లోనే సెంచరీ అందుకున్న ఈ బీహార్ బుడ్డోడు ఇప్పుడు ఇండియా క్రికెట్‌‌‌‌లో నయా సెన్సేషన్‌‌‌‌గా మారాడు. గుజరాత్ టైటాన్స్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌లో 35 బాల్స్‌‌‌‌లోనే వంద కొట్టి ఔరా అనిపించిన సూర్యవంశీపై అప్పట్లో సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఇప్పుడు మరోసారి అలాంటి గ్రేట్ ఇన్నింగ్స్ ఆడి వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలవడం విశేషం.