సిక్రెట్గా పెళ్లి చేసుకున్న స్వరా భాస్కర్

సిక్రెట్గా పెళ్లి చేసుకున్న స్వరా భాస్కర్

ప్రముఖ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సిక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఫహద్ అహ్మద్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరి 6న తమ వివాహం జరిగినట్లుగా స్వరా భాస్కర్ ప్రకటించింది. తాజాగా ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది. వెల్ కమ్ టూ మై హార్ట్ ఫహద్ అని ఆమె పోస్ట్ పెట్టింది. స్నేహంతో మొదలైన తమ ప్రయాణం ప్రేమ, పెళ్లి వరకు చేరుకుందని తెలిపింది. ఈ కొత్త జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్వర భాస్కర్  'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది.